కృష్ణ

పిన్నమనేని సతీమణి మృతితో జిల్లాలో విషాదఛాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, మే 17: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి మృతి చెందటంతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో వీరి కారుడ్రైవర్ దాసు కూడా మృతిచెందగా, వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం విజయవాడలో తమ సమీప బంధువు కుమార్తె ఓణీల ఫంక్షన్‌కు పిన్నమనేని దంపతులు హాజరయ్యారు. అనంతరం పిన్నమనేని అత్తగారి గ్రామం కుంటముక్కల వెళ్లి సోమవారం సాయంత్రం మళ్లీ విజయవాడలోని అన్నగారి ఇంటికి వచ్చారు. రాత్రి 7గంటలకు కారులో హైదరాబాద్ బయలుదేరారు. పహాడీషరీఫ్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో సాహిత్యవాణి, కారుడ్రైవర్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును తొలుత శంషాబాద్‌లోని ఒక ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలోకు తరలించారు.
మంత్రుల దిగ్భ్రాంతి
ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనలో ఆయన సతీమణి సాహిత్యవాణి, కారుడ్రైవర్ దాసు మృతి పట్ల మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి, ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు దేవినేని, కొల్లు మచిలీపట్నంలో జరిగిన జెడ్పీ సమావేశం అనంతరం రుద్రపాకలోని పిన్నమనేని స్వగృహానికి వెళ్లారు. వారి బంధువులను, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిన్నమనేని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలాఉండగా సాహిత్యవాణి పార్ధివదేహాన్ని హైదరాబాద్ నుండి రుద్రపాక తీసుకొచ్చారు. దీంతో రుద్రపాకలో విషాదఛాయలు అలముకున్నాయి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని కోలుకుంటున్నారని, బుధవారం ఉదయం హెలికాఫ్టర్‌లో ఆయనను రుద్రపాక తీసుకొచ్చిన అనంతరం సతీమణి అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. పిన్నమనేనికి ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావుకు గత సంవత్సరమే వివాహమైంది. తల్లి మృతి వార్త వినగానే పిల్లలు దిగ్భ్రాంతికి గురయ్యారు.