కృష్ణ

రుద్రపాక చేరిన సాహిత్యవాణి భౌతికకాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, మే 17: ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి భౌతికకాయాన్ని మంగళవారం వారి స్వగ్రామం రుద్రపాకకు తరలించారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మంగళవారం సాయంత్రం భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని భూపతిరాయుడు, గుత్తా శివరామకృష్ణారావు, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆమె భౌతికకాయాన్ని దర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పార్ధివదేహానికి బుధవారం ఉదయం రుద్రపాకలో అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.