కృష్ణ

పుష్కర పనుల్లో అలసత్వం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 17: కృష్ణా పుష్కర పనుల్లో అలసత్వం తగదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను హెచ్చరించారు. కృష్ణా పుష్కరాల తేదీ దగ్గర పడుతున్న దృష్ట్యా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, దేవాదాయ ధర్మాదాయ, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిగా కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు, జరుగుతున్న పనుల వివరాలను ఆయా శాఖల అధికారులతో జెడ్పీటీసిలు, ఎంపిపిలకు వివరించే ప్రయత్నం చేశారు. ఘాట్‌లు, రహదారులు, అప్రోచ్ రహదారుల మరమ్మతు పనుల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని మంత్రి దేవినేని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుని ఇతరత్రా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా జిల్లాలో 221 దేవాలాయాలను రూ.16.60 కోట్లతో అభివృద్ధి పర్చనున్నట్లు తెలిపారు. పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద 22 తాత్కాలిక పనులకు రూ.2.35 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఆర్ అండ్ బి ఎస్‌ఇ శేషుకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 20 రోడ్ల నిర్మాణానికి రూ.115కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఏడు ఆర్ అండ్ బి అతిథిగృహాల మరమ్మతులకు రూ.2కోట్లు మంజూరైనట్లు వివరించారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ పుష్కరాలు సమీపిస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. డిసిఎంఎస్ చైర్మన్ కంచి రామారావు మాట్లాడుతూ హనుమాన్ జంక్షన్ నుండి విస్సన్నపేట, జంక్షన్ నుండి పెడన వరకు రోడ్ల విస్తరణ పనులు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంపై మంత్రి దేవినేని ఉమ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా నవోదయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చాలావరకు కాపుసారాను నియంత్రించామన్నారు. ఎంఆర్‌పి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి దేవినేని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా కృష్ణా రివర్ బోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి నీరు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. సమావేశంలో కలెక్టర్ బాబు.ఎ, ట్రైనీ కలెక్టర్ సలోని, జెడ్పీ సిఇఓ నాగార్జున సాగర్, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయని పుష్పవతి, పలువురు జెడ్పీటిసిలు, ఎంపిపిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.