కృష్ణ

ధరలు తగ్గేవరకు మహిళలు ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, ధరలు తగ్గేవరకు మహిళలు ఉద్యమించాలని మహిళా సమాఖ్య మచిలీపట్నం ఏరియా కార్యదర్శి శీరంశెట్టి లలిత అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక రాజాగారి సెంటరులో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువులైన పప్పులు, నూనెలు, కాయగూరల ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకపోవటంతో అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గేవరకు మహిళలు పెద్దపెట్టున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏరియా కార్యదర్శి యర్రంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ ధరలు తగ్గించకుండా కేవలం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేయటంపై ఉన్న శ్రద్ధ ధరలు తగ్గించటంలో చూపటం లేదని విమర్శించారు. పట్టణంలో రెండు రోజులకు ఒకసారి విడుదల చేస్తున్న నీరు సైతం మురికిగా ఉంటున్నాయని, అవి తాగటానికి ఎందుకూ పనికిరావటం లేదన్నారు. ఫలితంగా అధిక ధరలు చెల్లించి మినరల్ వాటర్ కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం ఫిలిప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మాట్లాడకుండా కేవలం విదేశీ పర్యటనలు, రాజధాని నిర్మాణంపై మాత్రమే మాట్లాటడం విచిత్రంగా ఉందన్నారు. ధర్నాలో మన్యం జ్యోతి, మిండేలు వెంకటేశ్వరరావు, నక్క వాణి, గుర్రం కుమారి, గుర్రం వెంకటేశ్వరరావు, మోదుమూడి నాగరాజు, పవిత్ర, మహిళలు పాల్గొన్నారు.