కృష్ణ

ప్రతిపక్షం, టీఆర్‌ఎస్ వ్యాఖ్యలు అర్ధరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పరిపాలన, సంక్షేమ రాజ్యం అమలు జరుగుతుంటే ప్రతిపక్షం, టీఆర్‌ఎస్ విమర్శలు చేయటం అర్ధరహితమని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతున్నదని పరిపాలన విభాగాలకు తెలుగుదేశం పార్టీకి విరోధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 670 అవార్డులు ఇచ్చిందని తెలంగాణ నుంచి వచ్చిన మాట్లాడుతున్న తలసాని శ్రీనివాస యాదవ్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. హైదరాబాద్ మహానగరంలో యాదవులు అధికంగా ఉన్నారనే ఆ నాడు ఎమ్మెల్యేగా టిక్కెట్‌ను అన్న నందమూరి తారక రామారావు తలసాని శ్రీనివాస యాదవ్ అనే నీకు ఇవ్వబట్టి ఈ రోజున తలసాని శ్రీనివాస యాదవ్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారని, కులాలు లేని రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం అయినా ఉందా అని అర్జునుడు తలసాని శ్రీనివాస యాదవ్‌ను ప్రశ్నించారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడానికి డబ్బు, తాగుడు ప్రధాన కారణం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు 86 శాతం మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రజా విశ్వాసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వంకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చి ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్ పార్టీకి అర్జునుడు చాలెంజ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పివి పణికుమార్, ఎంకె హుస్సేన్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.