కృష్ణ

నా హయాంలో ఎనలేని అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గడిచిన నాలుగున్నర యేళ్లల్లో గరిష్ఠంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను అందించామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా జిల్లా పరిషత్ ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమె వివరించారు. తమ పాలకవర్గానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన ప్రజా ప్రతినిధులు, అధికారలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర చేతుల మీదుగా పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క గ్రామంలోని అంతర్గత రహదార్లన్నింటినీ సీసీ రోడ్లుగా అభివృద్ధిపర్చామన్నారు. అడిగిన వారందరికీ పక్కా గృహాలు, రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. 13వ ఆర్థికం సంఘం నిధులు జెడ్పీకి రానప్పటికీ చక్కని ప్రణాళికతో రూ.100కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించి చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. ముఖ్యంగా తమ హయాంలో మహిళా సంక్షేమానికి అత్యధిక నిధులు వెచ్చించినట్లు వివరించారు. మహిళలపై జరుగుతున్న లైగింక వేధింపుల నివారణకై వేయికళ్లతో అనే కార్యక్రమాన్ని 40 రోజులు జిల్లాలో నిర్వహించామన్నారు. చిరుధాన్యాల వినియోగం, పౌష్ఠికాహారంపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్యదీప్తి కార్యక్రమాన్ని 26 మండలాల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన మండలాల్లో కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

దళితరత్న కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఘన సన్మానం

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 19: జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా దళితరత్న అవార్డుకు ఎంపికైన జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతంను శనివారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర భారీనీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తదితరులు ఘనంగా సత్కరించారు. సంక్షేమ పథకాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతూ ముందుకు సాగుతున్న కలెక్టర్ లక్ష్మీకాంతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటుండటం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ఐలూరు సొసైటీలో నిధుల దుర్వినియోగం

*సొసైటీ అధ్యక్షుడి పొలం జప్తు

తోట్లవల్లూరు, జనవరి 19: మండలంలోని ఐలూరులోని శ్రీ రామేశ్వర ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్‌లో విచారించగా రూ.7,52,240లు నిధులు దుర్వినియోగం జరిగినట్లు సినియర్ కో ఆపరేటివ్ ఇన్స్‌పెక్టర్ పి గంగాధర్ శనివారం విలేఖరులకు తెలిపారు. దుర్వినియోగమైన నిధులు చెల్లించమని నోటీసులు ఇచ్చినా ఇంత వరకు చెల్లించకపోవటంతో సంఘ అధ్యక్షులు రామిశెట్టి సాంబశివరావుకు చెందిన పొలాన్ని విజయవాడ డిప్యూటి రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ ఆదేశాల మేరకు 2.25 ఎకరాల పొలాన్ని జప్తు చేసినట్టు గంగాధర్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆస్తులు అమ్మకం లేదా బహుమతిగా ఇచ్చుట, ఏ ఇతర లావాదేవీలు జరిపినా అట్టి లావాదేవీలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట సహకార భారతి న్యాయ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు ఉన్నారు.

మహిళా సాధికారత భవన్‌కు భూమి పూజ

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 19: జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సాధికారత భవన్‌కు శనివారం భూమి పూజ చేశారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు భూమి పూజలో పాల్గొన్నారు. రూ.10లక్షల వ్యయంతో మహిళా సాధికారత భవన్ నిర్మిస్తున్నట్లు చైర్‌పర్సన్ అనూరాధ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 16 మహిళా సాధికారత భవనాలు నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, జెడ్పీ సీఇఓ షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు.