కృష్ణ

ఎన్నికల్లో బూత్ కమిటీల పాత్రే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: రానున్న ఎన్నికలలో బూత్ కమిటీల పాత్రే కీలకమని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మాజీమంత్రి నెట్టం రఘురామ్‌లు అన్నారు. ఆదివారం పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్‌లెవల్ కమిటీ సభ్యులు సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్‌రాజగోపాల్, మాజీమంత్రి నెట్టం రఘురామ్‌లు మాట్లాడుతూ ఆయా బూత్‌ల పరిధిలో సభ్యులు కీలకపాత్ర వహించాలని అన్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం మార్పులు, చేర్పులు అలానే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తదితర అంశాలను కార్యకర్తలు అవగాహన కల్పించుకుని పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో యార్డు చైర్మన్ కట్టా నరసింహారావు, వత్సవాయి, పెనుగ్రంచిప్రోలు మండల కమిటి అధ్యక్షులు జొన్నలగడ్డ రాధాకృష్ణామూర్తి, చింతల సీతరామయ్య, జడ్‌పీటీసీ అమ్మనబోయిన రాణి, ఎ కమలమ్మ, మాజీ యార్డు చైర్మన్ మల్లెల గాంధీ, నీటి సంఘం నేత గోపాలకృష్ణమూర్తి తదితర నేతలు పాల్గొన్నారు.