కృష్ణ

సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27వ తేదీన కొమరవోలుకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. గ్రామంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామమైన కొమరవోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారన్నారు. ఉదయం 10.30 ని.లకు కొమరవోలు గ్రామానికి చేరుకుని 12.30 ని.ల వరకు గ్రామంలో ఉంటారన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత రూ.10 కోట్లతో చేపట్టి పూర్తి చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. తదుపరి మహిళా సాధికార భవన్, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మించిన 54 గృహాలకు, మెయిన్ రోడ్డు నుండి గ్రామంలోకి నిర్మించిన సీసీ రోడ్డు, 9.3 కిలోమీటర్ల నిడివి గల అండర్ డ్రైనేజీ నిర్మాణం, గ్రామంలో నిర్మించిన పలు సీసీ రోడ్లను సీఎం ప్రారంభిస్తారన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం రాష్ట్ర ప్రగతిపై వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, నాడు, నేడు, రేపు అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్‌ను సీఎం తిలకిస్తారన్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగం ఉంటుందన్నారు. సీఎం పర్యటించనున్న ప్రతి ప్రదేశంలోనూ గ్రీనరీతో పాటు టీ గార్డెన్‌లో ఆయా మొక్కల పేర్లను తెలియజేసే లేబుల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గుడివాడ, బందరు ఆర్డీవోలు సత్యవాణి, ఉదయ భాస్కర్, ముడా వీసీ విల్సన్ బాబు, డీఎస్పీ మహేష్, ఐసీడీఎస్ సీడీపీఓ కృష్ణకుమారి, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ శివకుమార్, పశు సంవర్ధక శాఖ జెడీ భరత్ రమేష్, డీపీఓ విక్టర్, డీఎల్‌పీఓ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.