కృష్ణ

టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: వైసీపీ కిట్‌ల పంపిణీలో గలాటా చోటుచేసుకుంది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కెపి) బొమ్మతో ముద్రించిన బ్యాగ్, వైసీపీ కేలెండర్, గోడగడియారం, పూరగుట్ట- అబద్ధపు పట్టా అనే పేరుతో ఉన్న కరపత్రాలను ఒక బ్యాగ్‌లో పెట్టి వైసీపీ నేతలు బుధవారం సాయంత్రం స్థానిక చంద్రబాబునగర్, ఆదాంపురం ఏరియాలలో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కొందరు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. పూరగుట్ట స్థలంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనేక పాట్లు పడుతుంటే కక్షతో అడ్డుకున్నది కాకుండా దానిపై కరపత్రాల రూపంలో తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. కర పత్రాలను పంచటానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. ఈ దశలో టీడీపీ నేతలు పాత ఎనె్నస్పీ క్వార్టర్ సమీపంలో తమ వర్గాన్ని ఎక్కువ మందిని కూడగట్టి వైసీపీ నేతల కార్యకలాపాలను మరో మారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు నెట్టుకుంటూ బాహాబాహీకి తలపడ్డాయి. పూరగుట్ట విషయంలో మంత్రి ఉమ పేదలకు పట్టాలివ్వకుండా జవాబు పత్రం పేరుతో ఒక కాగితాన్ని ఇచ్చి మోసం చేస్తున్న విషయంపై తాము ప్రజలకు తెలియజేస్తున్నామని, తమను అడ్డుకోవటం సరికాదంటూ వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి ఆరాటపడుతున్న మంత్రి ఉమను పట్టాలివ్వనీయకుండా అడ్డుకోవటమే గాక కరపత్రాల పేరుతో బదనాం చేయటాన్ని తాము ఒప్పుకునేది లేదని టీడీపీ నేతలు సుభాని, కరీం, మస్తాన్, ప్రసాద్, వెంకయ్య, బాలకృష్ణ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఐనప్పటికీ టీడీపీ నేతలు మాత్రం అవకాశం ఉన్న చోట వారిని అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు తమ కిట్‌లను మైలవరం నియోజకవర్గంలో పంపిణీని విజయవంతంగానే పూర్తి చేస్తున్నారు.