కృష్ణ

డ్రామాలు కట్టబెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ‘పోర్టు’ విషయంలో ఇప్పటి వరకు ప్రతిపక్షం ఆడిన డ్రామాలు ఇకపై కట్టబెడితే మంచిదని లేకుంటే ప్రజలే వారికి మరోసారి తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓడరేవు నిర్మాణ పనుల ప్రారంభంతో చారిత్రక నేపథ్యం కలిగిన బందరుకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పోర్టు పనులు ప్రారంభం శుభారంభం కాబోతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభింప చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇకపై పోర్టు పనులు శరవేగంగా సాగి 18 నెలల్లో తొలి ఓడ బందరు తీరానికి వస్తుందని స్పష్టం చేశారు. పనుల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన బహిరంగ సభ జిల్లా స్థాయిని తలపించిందన్నారు. దీన్ని చూసి ఓర్చుకోలేని ప్రతిపక్షం ఇంకనూ పోర్టుపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. ఇటువంటి దుష్ట శక్తులకు బందరులో ఉండేందుకు అర్హత లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ, ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ప్రతిపక్ష వైసీపీ నాయకులు పోర్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వేసిన డ్రామా అంటూ లేదని విమర్శించారు. ఇటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారంలో ఉండగా పోర్టును తరలించిన గత పాలకులు ప్రతిపక్షంలోకి రాగానే రైతుల్లో అలజడి సృష్టించి పోర్టు నిర్మాణానికి ప్రధాన ఆటంకంగా మారారన్నారు. పోర్టుపై స్పష్టమైన హామీతో అధికారంలోకి వచ్చిన తాము మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పోర్టు పనులు ప్రారంభించి చూపించామన్నారు. ఏ ఒక్క రైతుకీ అన్యాయం జరగనివ్వమని గతంలో చెప్పిన మాదిరిగానే ఎకరానికి రూ.25లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి రైతుల సంపూర్ణ అంగీకారంతో భూసేకరణ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనే అన్నారు. గడిచిన నాలుగున్నర యేళ్లుగా నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కలగా మిగిలిపోయిన పోర్టుతో పాటు స్టేడియం, నర్సింగ్ కళాశాల రహదారుల విస్తరణ తదితర పనులను చేపట్టి వివిధ దశలకు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 13వతేదీన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.25కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అలాగే చిలకలపూడి నుండి మంగినపూడి బీచ్ రోడ్డులో మిగిలిన విస్తరణ పనులను కూడా రూ.26కోట్లతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో రూ.13కోట్లతో బీచ్ రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన అంబేద్కర్ భవన్ నిర్మాణంలో లోపాలను గుర్తించి దాని స్థానంలో రూ.5.60కోట్లతో పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.5కోట్లతో నిర్మించనున్న కాపు భవన్‌కు కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. పోర్టు పనుల ప్రారంభోత్సవ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు పోర్టు పైలాన్ వద్ద అభినందన సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 14వతేదీన మచిలీపట్నం పురపాలక సంఘానికి ప్రత్యేకంగా విడుదలైన రూ.90కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. చింతచెట్టు సెంటరులో నిర్మాణం పూర్తి చేసుకున్న రెండవ రైతు బజారును ప్రారంభిస్తామన్నారు. అలాగే జెడ్పీ సెంటరులోని స్విమ్మింగ్ ఫూల్ సమీపంలో రూ.2.5కోట్లతో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఇవిగాక మరికొన్ని అభివృద్ధి పనులను రెండు మూడు రోజుల్లో గ్రౌండింగ్ చేస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రధానికి కలెక్టర్ ఘన స్వాగతం

మచిలీపట్నం, ఫిబ్రవరి 10: రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం గన్నవరం విమానశ్రయానికి చేరుకున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ స్వాగతం పలికారు. గుంటూరులో నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో పాల్గొనేందుకు గాను ప్రధాని మోదీ ప్రత్యేక విమానం ద్వారా ఉదయం 10.30ని.లకు గన్నవరం విమాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత, డీజీపీ ఠాకూర్‌తో పాటు జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ ప్రధానికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.