కృష్ణ

ప్రతి నియోజకవర్గంలోనూ గురుకులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక 3వ వార్డు వలందపాలెంలో మహాత్మ జ్యోతీబాపూలే ఏపీ బీసీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి విద్యను బడుగు, బలహీన వర్గ విద్యార్థులకు గురుకులాల ద్వారా అందిస్తున్నామన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 32 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయని, తదనంతరం తమ ప్రభుత్వం తొలి విడతలో 65 పాఠశాలలను మంజూరు చేసిందన్నారు. తదుపరి విడతలో మరో 87 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బీసీ సంక్షేమానికి గత ఏడాది రూ.10వేల కోట్లు బడ్జెట్ కేటాయించామన్నారు. ఈ ఏడాది 33.5 శాతం నిధులు బీసీ సంక్షేమానికి కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, బీసీ గురుకుల పాఠశాలల విద్యా సంస్థ కార్యదర్శి ఎ కృష్ణమోసన్, బీసీ కార్పొరేషన్ ఇడీ పెంటోజీరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణ యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
కాగా, మచిలీపట్నంలో రూ.2.5కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీకృష్ణ యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు గురువారం మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు శంకుస్థాపన చేశారు. ఎంతో కాలంగా కలగా మారిన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు యాదవ సామాజిక వర్గీయులంతా రుణపడి ఉంటారన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

జ్యోతిబా పూలే ఆదర్శం
మహాత్మ జ్యోతీబా పూలే ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం స్థానిక వలందపాలెం బీసీ సంక్షేమ వసతి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన జ్యోతీబా పూలే విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించేందుకు బడుగు బలహీన వర్గాలు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని తలంచిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అన్నారు. ఎంతో సామాన్య జీవితం గడిపిన మహనీయుడన్నారు.