కృష్ణ

అన్ని వర్గాలకు టీడీపీ సముచిత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి: స్థానిక వికలాంగుల కాలనీ వద్ద ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ శనివారం రూ.50 లక్షలతో నిర్మించనున్న కాపు కల్యాణ మంటపానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేకూరుస్తుందన్నారు. ఆదరణ పథకం కింద చేతి వృత్తుల వారికి, డ్వాక్రా మహిళలు, రైతులకు రూ.10వేలు చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, చెత్త నుండి సంపద కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్‌లు రెట్టింపు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎం జయలక్ష్మి, మండల టీడీపీ అధ్యక్షుడు ఎం జనార్ధనరావు, కార్యదర్శి కోనేరు వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

బాబు ముందు చూపుతోనే రాష్ట్భ్రావృద్ధి

*ఎంపీ రవీంద్రబాబు

అవనిగడ్డ, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు కారణంగానే రాష్ట్భ్రావృద్ది సాధ్యమవుతోందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఇదే అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి చంద్రబాబుకు పట్టం కట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పట్టిసీమ ద్వారా సాగునీరు వస్తున్న కారణంగానే పలు జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయన్నారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.5.50 కోట్ల వ్యయంతో పలు సిమెంట్ల రహదారులు నిర్మించటం జరిగిందని, చంద్రబాబు పాలనా దక్షతలో భాగంగా వౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనివ్వటం జరుగుతుందన్నారు.