కృష్ణ

భక్తిశ్రద్ధలతో సింధూ స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమం వద్ద మంగళవారం వేలాది మంది భక్తులు సింధూ స్నానాలు ఆచరించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా వేకువ జాము నుండి సాయంత్రం పొద్దు పోయే వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు సాగర సంగమానికి తరలి వచ్చారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సతీసమేతంగా సాగర సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. తొలుత సంగ క్షేత్రాన ఉన్న కృష్ణమ్మ పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హంసలదీవి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సింధూ స్నానాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు తమ సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ప్రజలకు చెంతకు రెవెన్యూ సేవలు

మచిలీపట్నం, ఫిబ్రవరి 19: రెవెన్యూ శాఖను ప్రజలకు చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన ఆయన మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు రెవెన్యూ శాఖ పరంగా ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన సమస్యలన్నింటికీ తక్షణ పరిష్కార చర్యలు చూపుతానన్నారు. రానున్న ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ తనకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎన్నికల సంఘం సూచనలు, సలహాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలను పూర్తి స్తాయి పారదర్శకతతో నిర్వహిస్తామన్నారు. డీఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్‌కు ముడ వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు, కలెక్టరేట్ ఎఓ మాధురితో పాటు పలువురు తహశీల్దార్లు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.