కృష్ణ

నూజివీడు ‘రాత’ మారుస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: గత పాలకులు మామిడి పంటపై శ్రద్ధ చూపలేదని ఫలితంగా మామిడి రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నూజివీడులో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మామిడిపై ప్రత్యేక దృష్టి సారించి మామిడి కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేయటంతో పాటు మామిడి ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, తద్వారా కనీసం అయిదు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నూజివీడు పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు రింగురోడ్డు నిర్మిస్తామని, నూజివీడులోని ప్రభుత్వ వైద్యశాలను ఆధునీకరించి, పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి, పేదలందరికీ ఇక్కడే అన్ని రకాల వైద్యసేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి, పేద ప్రజల వద్దకు వైద్యసేవలు అందిస్తామని అన్నారు. ఆగిరిపల్లిలో డిగ్రీ కళాశాల లేకపోవటంతో ఏటా 500 మంది విద్యార్ధులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతూ చదువుతున్నారని, జనసేన అధికారంలోని రాగానే ఆగిరిపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉచిత బస్సు పాసు సౌకర్యంతో పాటు భోజన, వసతికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించి, విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు నూజివీడుకు ఉన్నాయని, టీడీపీ ప్రభుత్వం నూజివీడు పేరును రాజధానికి ఉపయోగించుకుని లబ్ధి పొందిందని ఆరోపించారు. వైకాపాకు ఓటేస్తే కేసీఆర్‌కు ఓటేసినట్లేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుతూ జనసేన వైపు చూస్తున్నారని, ఎన్నికలలో జనసేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నూజివీడు అభ్యర్థి బసవ భాస్కరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నూజివీడు మామిడి కాయలను అభ్యర్థి బసవ భాస్కరరావు జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌కు అందజేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్‌పర్సన్ బసవ రేవతి, అభ్యర్ధి బసవ బాస్కరరావు, సీపీఐ నాయకులు చలసాని వెంకట రామారావు, కొమ్మన నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు జి రాజు, జనసేన నాయకులు పాతూరి రవి తదితరులు పాల్గొన్నారు. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సభకు ప్రజలు భారీ స్ధాయిలో తరలి వచ్చారు.