కృష్ణ

మిత్ర ధర్మం తప్పను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మిత్ర ధర్మాన్ని తప్పే వ్యక్తిని తాను కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పొత్తులపై స్పందించారు. సరికొత్త రాజకీయాల కోసం సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీలతో కూటమిగా ఏర్పడ్డామన్నారు. వారు కోరుకున్న స్థానాలకు వారికి ఇచ్చామన్నారు. అయితే సీపీఐ ఖరారు చేసిన అభ్యర్థుల విషయంలో తనకు పార్టీ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆ స్థానాలకు వారికి కేటాయించలేకపోయానే గానీ వేరే ఉద్దేశ్యం లేదన్నారు. ఈ విషయాన్ని ముందుగానే సీపీఐ నేతలకు చెప్పానని, అయితే వారు అర్ధం చేసుకోకపోవడం బాధాకరమన్నారు. సీపీఐకు మనస్ఫూర్తిగా అండగా ఉంటానని, కాదు కూడదని పొత్తు నుండి విడిపోతానంటే అది మీ ఇష్టానికే వదిలేస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మట్టి మూకుడు... సజ్జ అన్నం!

మచిలీపట్నం, మార్చి 24: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం మంగినపూడి బీచ్ లైట్ హౌస్ వద్ద ఉన్న మామిడి తోటల్లో కొద్దిసేపు సేద తీరారు. సాయంత్రం 6 గంటల సమయంలో బంటుమిల్లిలో బహిరంగ సభను ముగించుకున్న ఆయన నేరుగా పెదపట్నం మీదుగా మంగినపూడి బీచ్ లైట్ హౌస్‌కు చేరుకున్నారు. కొద్దిసేపు పచ్చని చెట్ల నీడలో సేద తీరి అక్కడే మట్టి మూకుడులో మజ్జిగలో కలుపుకున్న జొన్న అన్నాన్ని తిన్నారు. వేప చెట్టు కింద జనసైనికులు ఏర్పాటు చేసిన తాటాకు చాపల మీద కూర్చుని పవన్ కల్యాణ్ భోజనం చేశారు.