కృష్ణ

కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుని హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, మే 27: రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం ఒక యువకుని హత్యకు దారితీసింది. శుక్రవారం ఉదయం ఇంటికి పాల ప్యాకెట్లు తీసుకు వెళుతుండగా ఇనుపరాడ్లతో దాడి చేసి మరీ హత్య చేశారు. అనంతరం ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులపై కూడా దాడి చేయటంతో ముగ్గురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో శుక్రవారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఎన్‌టిఆర్ కాలనీలో నివాసం ఉండే మోతే నాగరాజు (30) కుటుంబానికి, మేతే వినోద్ కుటుంబం మధ్యం వైరం ఉంది. రెండు సంవత్సరాల నుండి తరచూ రెండు కుటుంబాలు గొడవలు పడుతున్నాయి. ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. సుమారు వారం రోజుల క్రితం కూడా వీరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు మందలించి పంపారు. ఈ తరుణంలో మోతే నాగరాజు (35) శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఇంటికి పాల ప్యాకెట్లు తీసుకు వెళ్తుండగా అతని కోసం ఎదురుచూస్తున్న వినోద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కార్తీక్, ప్రేమ్, దుర్గారావు, దయాకర్ ఒక్కసారిగా నాగరాజుపై ఇనప రాడ్లతో దాడి చేశారు. నాగరాజు తలకు బలమైన గాయమైంది. దెబ్బలు ఎక్కువగా తగలటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వినోద్ కుటుంబ సభ్యులు నాగరాజు ఇంటిపై దాడి చేశారు. ఇంటిలో ఉన్న నాగరాజు కుటుంబ సభ్యులు సాయిబాబు, రంగమ్మ, గీతపై దాడి చేశారు. వీరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు, 108కు ఆ ప్రాంత వాసులు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన నాగరాజు, కుటుంబ సభ్యులను నూజివీడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలకు తరలిస్తుండగా నాగరాజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సాయిబాబు, రంగమ్మ, గీతకు నూజివీడు ఏరియా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే
ఎన్‌టిఆర్ కాలనీకి చెందిన మోతే నాగరాజు, వినోద్ కుటుంబాల సభ్యులు ఇటీవల ఎక్కువగా గొడవలు పడుతున్నారు. తరచూ పోలీస్టేషన్‌లో పంచాయతీ కూడా జరుగుతోంది. వినోద్ నుండి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పట్టణ పోలీసులకు మోతే నాగరాజు విన్నవించుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు పరస్పరం గొడవలు పడుతున్న రెండు కుటుంబాల సభ్యులకు కౌనె్సలింగ్ ఇచ్చి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఉంటే నేడు హత్య జరిగి ఉండేది కాదని కాలనీ వాసులు స్పష్టం చేస్తున్నారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరిగాయని, నాగరాజును హత్య చేసిన వినోద్ బహిరంగంగానే పోలీసులు ననే్నమీ చేయలేరు, నాగరాజును చంపుతానని తిరిగాడని చెబుతున్నారు. వినోద్‌పై పలు కేసులు ఉన్నాయని, రౌడీషీట్ తెరుస్తామని చెప్పిన పోలీసులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అక్రమ సంబంధం వల్లే ఈ రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగిందని కాలనీ వాసులు తెలిపారు. నూజివీడు డిఎస్‌పి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సంఘటన కారణాలను తెలుసుకున్నారు. మృతదేహానికి స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్ట్‌మార్టం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్‌ఐ బి ఆదిప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.