కృష్ణ

ఇటు వడగాలులు.. అటు గాలివానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 27: తూర్పు కృష్ణా వాసులను వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేయగా పశ్చిమ కృష్ణా వాసులను ఈదురు గాలులు భయాందోళనకు గురి చేశాయి. వాతావరణంలో నెలకొన్న భిన్న పరిస్థితులు ఎవరికీ అంతు పట్టని విధంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలో పలు చోట్ల వడగాలులు విజృభించగా అదే స్థాయిలో వడగాలులు కూడా ఠారెత్తించాయి. గురువారం సాయంత్రం తూర్పు కృష్ణాలో భీకరమైన ఈదురు గాలులు వీచటంతో కొద్దిపాటి వర్షం పడింది. ఉదయం మాత్రం భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. దీనికి భిన్నంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ కృష్ణాలో తీవ్రమైన ఈదురు గాలులు ఆ ప్రాంత వాసులను భయాందోళనలకు గురి చేశాయి. జగ్గయ్యపేట, నందిగామ, వీరుళ్ళపాడు, చందర్లపాడు, కంచికచర్ల తదితర ప్రాంతాల్లో భీకరమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకొరగటంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోవటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్‌కో అధికారులు తక్షణమే స్పందించి నేలకొరిగిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అలాగే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. వీరుళ్ళపాడు మండలం అల్లూరు గ్రామంలో పిడుగు పాటుకు లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. ఇదిలా ఉండగా తూర్పు కృష్ణాలో మాత్రం ఎండలు భగ్గుమన్నాయి. ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు తీవ్రమైన వడగాల్పులు ఈ ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మండుటెండలకు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రహదారులన్నీ జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి.