కృష్ణ

వైభవంగా ఆది దంపతులకు పవళింపుసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి అదిష్ఠాన దేవత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా 7వ రోజైన ఆదివారం రాత్రి ఘనంగా శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి పవళింపుసేవ ఘనంగా నిర్వహించారు. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఋత్వికులు దేవస్ధానం ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతుల చేత శ్రద్ధతో ఈకార్యక్రమా న్ని చేయించారు. సెక్షన్ పర్యవేక్షణాధికారి ఎన్ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పల్లకిని పుష్పాలతో అలకరించి ఉత్సవ మూర్తులను ఉంచారు. ఈవో కోటేశ్వర మ్మ దంపతులను కూర్చోబెట్టి సుమా రు 2గంటలపాటు ప్రత్యేక పూజలను చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వా మికి పంచహారతులు నిర్వహించారు. అనంతరం ఈవో దంపతులకు దివ్య ఆశీస్సులు అందచేశారు. ఈకార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు, సెక్షన్ సిబ్బంది లక్ష్మణ్, పునీత్, సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు. అర్చకులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 8గంటల నుండి మూల మంత్ర హవనం, సాయంత్రం 4గంటల నుండి 6-30గంటల వరకు ఔపాసన,బలిహరణలు నిర్వహించిన అనంతరం అర్చకులు అమ్మవారికి హారతి ఇచ్చారు.
శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో..
ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్ర సహిత కల్యా ణ పుష్పయాగ మహోత్సవాల్లో భాగం గా ఆదివారం ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆదేశాలతో అర్చకుడు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవేంద్రశర్మ ఈవో కే నాగరాజు దంపతుల చేత పవళింపుసేవను ఘనంగా చేయించారు. సిబ్బంది పుష్పాలతో పల్లకిని అలకరించి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి పల్లకిలో ఉంచారు. భక్తుల సమక్షంలో అర్చకులు ఈకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈవో దంపతులకు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దివ్య ఆశీస్సులను అందచేశారు. ఉదయం అమ్మవారికి త్రికాల సహస్ర నామార్చన, స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశరుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం ఔపాసన, సాయంత్రం బలిహరణలు నిర్వహించారు.