కృష్ణ

పోర్టేమైంది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు పోర్టు ఏమైంది...? ఎన్నికల గాలిలో కొట్టుకుపోయిందా..? లేక రానున్న కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు..? అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాన అస్తమ్రైన బందరు ఓడరేవు నేటికీ అపహాస్యం పాలవుతూనే ఉంది. పరదేశీయుల పాలనలో ఒక వెలుగు వెలిగిన ఈ పోర్టు పరదేశీయుల పాలనలో మరుగున పడిన సంగతి తెలిసిందే. అయితే గత దశాబ్ద కాలంగా పోర్టుపై రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రకటనలు ఈ ప్రాంత ప్రజల్లో ఎన్నో ఆశలను రేకెత్తించాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టినా సఫలీకృతం కాలేదు. నాటి ప్రతిపక్షం అనేక ఉద్యమాలు చేసి 2014లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భూసేకరణ పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పోర్టు నిర్మిస్తామని చెప్పిన నాటి పాలకులు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు పనులు ప్రారంభించి మమ అనిపించారు. నాడు ప్రారంభమైన పనులు నేడు జరుగుతున్నాయా..? అంటే జరగడం లేదనే చెప్పాలి. ప్రజల్లో కూడా పోర్టు పనులపై అంత నమ్మకం కూడా కలగడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభించిన నాడే ఇదంతా ఎన్నికల స్ట్రంట్ అన్న విమర్శలు రాజకీయ పక్షాల నుండే కాకుండా ప్రజల నుండి వచ్చాయి. దీంతో పోర్టు నిర్మాణంపై ఆశలు సన్నగిల్లిపోయాయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోర్టు నిర్మాణానికి తీవ్రమైన కృషే జరిగింది. తొలుత పోర్టుకు అవసరమైన భూమితో పాటు పారిశ్రామిక వాడ నిమిత్తం పెద్ద ఎత్తున భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం చిట్ట చివరకు భూసేకరణ, భూ సమీకరణ, భూ కొనుగోలు పథకాలను రైతుల ముంగిట పెట్టారు. పారిశ్రామిక వాడకు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌కు కాలం చెల్లిన తర్వాత ఆ ఊసు ఎత్త కుండా కేవలం పోర్టు భూముల కోసం ప్రయత్నాలు చేశారు. 5వేల 300 ఎకరాల పోర్టు భూముల్లో 3100 ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూములను ముందుగానే సేకరించిన ప్రభుత్వం మిగిలిన పట్టా భూముల కోసం రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. 700 ఎకరాలు భూసమీకరణ ద్వారా మరో 700 ఎకరాలు భూ కొనుగోలు పథకం కింద సేకరించారు. ఇంకా వెయ్యి ఎకరాల వరకు భూములు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోసం పనులు ప్రారంభింప చేశారు. భూముల కొనుగోలుకు సంబంధించి మచిలీపట్నం అర్మన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా)కు అందాల్సిన బ్యాంక్ రుణం కూడా నేటికీ అందలేదు. ఈ పరిస్థితుల్లో పోర్టు నిర్మాణం అటకెక్కిందనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఎన్నికల ముగిసిన నేపథ్యంలో నేడు పోర్టుపై మాట్లాడే వాడే కరువయ్యారు. మే 23వతేదీన కౌటింగ్ ప్రక్రియ అనంతరం ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం చేతుల్లోకి పోర్టు భవితవ్యం వెళ్లనుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుత అధికార పక్షం పోర్టు పనులను కొనసాగిస్తుందా..? లేక ప్రతిపక్షం పోర్టు కలను నెరవేరుస్తుందా..? లేదంటే ఎప్పటికి మాదిరిగానే రాజకీయ పక్షాలకు పోర్టు నినాదంగానే మారుతుందా..? అనేది వేచి చూడాల్సిందే.