కృష్ణ

అందరి చూపు గెలుపు వైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఎన్నికల కురుక్షేత్రంలో విరోచిత పోరాటం చేసిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలేందుకు సమయం అసన్నమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొనగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతాయోనన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ ముగిసిన మరుక్షణం నుండి గెలుపు ఓటములపై భేరీజు వేసుకున్న అభ్యర్థులు నేడు గెలుపు నీదా..? నాదా..? అంటున్నారు. ఎక్కడ చూసినా అభ్యర్థుల విజయావకాశాలపై చర్చ జరుగుతోంది. కౌంటింగ్ రోజున వెలువడనున్న ఓటరు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విడత ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఫలితాలు కూడా అదే స్థాయి ఉత్కంఠతకు గురి చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం రెండు పార్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, జనసేన కూటమికి చెందిన అభ్యర్థులు బరిలో నిలిచి తీవ్రమైన పోటీ ఇచ్చారు. ఫలితాలపై జనసేన ప్రభావం జిల్లాలో పెద్దగా కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. కానీ గెలుపు ఓటములను నిర్ణయించే పార్టీగా జనసేన తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సీపీల మధ్యే పోటీ తీవ్రంగా జరిగింది. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ జిల్లాలో పాగా వేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయా..? లేకపోతే మిశ్రమ ఫలితం రానుందా అనేది కూడా ప్రశ్నార్ధకంగానే మారింది. ఇకపోతే బెట్టింగ్‌ల జోరు కూడా ఊపందుకుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల విజయావకాశాలపై ఆయా పార్టీ కార్యకర్తలు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. గెలుపు ఓటములతోనే కాకుండా మెజార్టీ ఓట్ల మీద కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. కొంత మంది ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా బెట్టింగ్‌లకు పాల్పడుతుంటే మరికొంత మంది అభ్యర్థుల సామర్ధ్యాన్ని, ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరును బేరీజు వేసుకుని ఆచి తూచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.