కృష్ణ

విజయవాడ బస్‌స్టేషన్‌లో వినోదాల విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 3: దూరప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు గమ్యం చేరడానికి గతంలో గంటల తరబడి ఎదురుచూస్తూ విసిగిపోయేవారు. అలాంటి వారి కోసం దేశంలోనే ప్రప్రథమంగా బస్‌స్టేషన్‌లోనే రెండు మినీ థియేటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు అన్నారు. ఆ థియేటర్లు కూడా జూన్ 6న ప్రారంభం కానున్నాయని ఎండి సాంబశివరావు తెలిపారు. వైస్క్రీన్స్ పేరున నిర్మించిన ఈ రెండు ధియేటర్లు మినీ ఐమాక్స్‌లా ప్రయాణికులకు వినోదాల విందును అందజేయనున్నాయన్నారు. ఏదేమైనా విజయవాడ బస్‌స్టేషన్‌ను భూతల స్వర్గాన్ని మరిపించనుందని ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత టివిలు ఏర్పాటు చేసిన అమరావతి బస్‌లు కూడా ప్రయాణికుల ఆదరణ పొందుతాయనడంలో అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి, రాష్టమ్రంత్రులు జూన్ 6న బస్‌స్టేషన్‌లో మినీ థియేటర్స్ అడ్మినిస్ట్రేటర్ బ్లాక్, ఆంధ్రా బ్యాంక్, సిట్‌బస్ పోర్టల్ ప్రారంభించడానికి ఆర్టీసీ అధికారులు అన్ని రకాలుగా సంసిద్ధమవుతున్నారు.