కృష్ణ

జగ్గయ్యపేట ఫలితాలపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో ఫలితాల కోసం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నెల 11వ తేదీన ఎన్నికలు జరిగిన నాటి నుండిలెక్కింపునకు 42 రోజుల సమయం ఉండటంతో గెలుపు ఓటములపై మొదటి 3, 4 రోజుల జోరుగా చర్చలు, పందాలు సాగినా ఆ తరువాత కొంత నెమ్మదించింది. ఏ నలుగురు కలిసిన ఎవ్వరు గెలుస్తారన్న దానిపై పార్టీల పరంగా ఎవరి నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట, పెనుగ్రంచిప్రోలు, వత్సవాయి మండలాలు, నందిగామ నియోజకవర్గంలోని ఏటి పట్టు గ్రామాలు కలిసి జరిగిన ఎన్నికలో జగ్గయ్యపేటలో ఏ పార్టీ అయితే మెజార్టీ సాధిస్తుందో ఆ పార్టీదే విజయమన్న అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది. తెలుగుదేశం విషయానికి వస్తే గత పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆదుకునేలా ఇచ్చి ఆరోగ్య శ్రీ, మహిళలకు ఇచ్చిన పసుపు కుంకుమ పథకంతో తెలుగుదేశానికి విజయం ఖాయమని, మహిళలు పెద్ద ఎత్తున అందుకే తరలివచ్చి ఓట్లు వేశారని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌లు దేశం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలో తొలి నుంచి మెజార్టీ తమదేనని, ఈ ఎన్నికల్లోనూ అధిక మెజార్టీ సాధించి హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తామని శ్రీరామ్ బ్రదర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను ఈ ఎన్నికలకు ముందు నుంచి శ్రమించి ఒంటిచేత్తో నడిపించారు. జగన్మోహనరెడ్డి నవరత్న పథకాలు, తాను అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగామని, ఎన్నికల ప్రచారం చివరలో పట్టణంలో జరిగిన వైఎస్ షర్మిల ప్రచారం తనకు ఎంతో లాభిస్తుందని సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో దేశం మెజార్టీకి గండి కొట్టడం ఖాయమని, తమ విజయం స్పష్టమైందని ఉదయభాను అంటున్నారు. కాగా ఇరు పార్టీల్లోను జనసేన ఓట్లు చీల్చుకుంటుందన్న భయం అతర్లీనంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌పై అభిమానం ఏ మేరకు ఉంది, సామాజిక వర్గం నుండి ఎన్ని ఓట్లు చీలతాయి అన్నది ఎవరి లెక్కలు వారికి ఉన్నా అవి ఏ మేరకు గండి కొడాతాయోనన్న భయం ఇరు పార్టీలను వేధిస్తోంది. సామినేని ఉదయభాను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, జనసేన అభ్యర్ధి కూడా ఆ సామాజిక వర్గానికే చెందినా పెద్దగా ప్రభావం చూపదని, పవన్‌పై అభిమానం తమకంటే తెలుగుదేశానికే నష్టమని, గతంలో పవన్ బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మరో 24 గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే లోలోన టెన్షన్‌తో కొట్టుమిట్టాడుతున్నారు.