కృష్ణ

ట్రిపుల్ ఐటీలో డ్రోన్ టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో డ్రోన్ టెక్నాలజీ ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు డైరెక్టర్ డి సూర్యచంద్రరావు తెలిపారు. వ్యవసాయం, భద్రత పర్యవేక్షణ, స్మార్ట్ నగరాలు వంటి వివిధ రంగాలలో ఇమేజ్ ప్రోసెసింగ్, డ్రోన్ పైలెటింగ్ వంటి ప్రధాన లక్ష్యాలతో కూడిన డ్రోన్ టెక్నాలజీ ప్రయోగశాల ఏర్పాటు కోసం రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌తో పాటు అమెరికాకు చెందిన ఐటీ సంస్థ అధికారులతో డైరెక్టర్ సూర్యచంద్రరావు శనివారం సమావేశం అయ్యారు. డిజైన్ మోడలింగ్ ఎనాలసిస్, ఫ్యాబ్రికేషన్ విభాగం, అసెంబ్లింగ్ అండ్ ఎలక్ట్రిక్ విభాగం, సెన్సార్ అండ్ కంట్రోల్ విభాగంతో పాటు పలు విభాగాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు సుముఖత వ్యక్తం చేశారని డైరెక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. ఈ సమావేశంలో ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి సునీల్ భగత్, అకడమిక్ డీన్ బండి ప్రసాద్, వీర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.