కృష్ణ

మైలవరం అభివృద్ధే ధ్యేయం: వసంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, : మైలవరం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ గొల్లపూడిలోనే నివాసం ఉంటానన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించడానికి కృషి చేసిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో తనపై ఉమ ఎన్నో వ్యక్తిగత ఆరోపణలు చేసినా, కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టించినా నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా విటిపిఎస్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి పెడతానన్నారు. నవరత్నాల అమలు కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటానన్నారు. గొల్లపూడిలో వైసిపిని బలోపేతం చేస్తానన్నారు. గెలుపుతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. పాత్రికేయులకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.

అభయాంజనేయునికి 1008 తామరపూలతో అర్చన

హనుమాన్ జంక్షన్, మే 26: స్థానిక అభయాంజనేయునికి ఆదివారం 1008 తామరపూలతో అర్చన నిర్వహించారు. హనుమాన్‌జయంతి ఉత్సవాలలో భాగంగా ఈప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అలయ ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు తెలిపారు. స్వామి వారికి తెల్లవారు ఝామున ప్రభాత సేవ, తామరపూలతో అర్చన, దాతల గోత్ర నామాలతో పూజా, సాయంత్రం వెండి, బంగారు పూలతో పూజ,నక్షత్ర హారతి కార్యక్రమాన్ని శాస్రోక్తంగా అర్చకులుజరిపారు. కొయ్యూరు రాథాకృష్ణ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా, ఇమ్మిళ వెంకాయమ్మచే భజన కార్యక్రమం, కుసుమసాయిచే కూచిపూడి నృత్యప్రదర్శన, ఏలూరు వారిచే మ్యూజికల్ నైట్ కార్యక్రమాలను ప్రదర్శించారు.

లక్ష్యాన్ని నిర్దేశించుకుని
భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి
పాయకాపురం, మే 26: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చిల్డ్రన్స్ హోంలో చదివిన 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆదివారం మెరిట్ సర్ట్ఫికెట్స్, మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 91 చిల్డ్రన్స్ హోంలలో 268 మంది 10వ తరగతి పరీక్షలు రాశారని, వారిలో 257 మంది ఉత్తీర్ణులైనారని తెలిపారు. వారిలో 38 మంది 9 పాయింట్లు పైగా సాధించారని, వారందరికీ మెరిట్ సర్ట్ఫికెట్స్ అందించి ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. సమాజంలో నిరాదరణకు గురైన పిల్లలను హోంలో చేర్పించి వారికి విద్యాబుద్ధులను నేర్పించి, ఉన్నత చదువులు చదివించేందుకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బాలల సంక్షేమ శాఖ నిర్వహణలో గల చిల్డ్రన్స్ హోం మరింత అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కలెక్టర్ కోరారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారికి ఇష్టమైన కోర్సులలో చదివేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 బాబూరావు, జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

మానసిక రోగి హల్‌చల్
విజయవాడ పశ్చిమ, మే 26: పంజాసెంటర్‌లో ఆదివారం మండుటెండల్లో ఓ మానసిక రోగి కొత్తపేట పోలీసులకు ముచ్చెమటలు పట్టించి పరుగులు తీయించాడు. సుమారు అర్ధగంత పాటు ప్రధాన డ్రైనేజి చప్టాకిందకెళ్ళిపోయి కంగారెత్తించిన వైనమిది. పంజాసెంటర్‌లో ఊరూపేరూ తెలియని ఓ యువకుడు చేతిలో కర్ర పట్టుకుని భయానక వాతావరణం సృష్టించాడు. వచ్చిపోయి వారిని బెదిరించి సాగాడు. ఓ హెడ్‌కానిస్టేబుల్, ఓ కానిస్టేబుల్‌పై తన వద్దగల కర్రతో దాడి చేశాడు. అయినా అతడిని వెంటాడగా పరుగులు తీసి గణపతిరావురోడ్డులోని ప్రధాన డ్రైనేజీలో దూకేశాడు. అతడు ప్రాణాలు కోల్పోతాడేమోనని కంగారు పడిన పోలీసులు బయటకు తీయడానికి యత్నించినా వారికి చిక్కలేదు. సుమారు అర్ధగంట పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. దూకిన ప్రాంతం నుండి కనుమరుగైయ్యాడు. అండర్‌డ్రైనేజీలో ఎంతలోతుందో తెలియని స్థితిలో ఆ యువకుడు మృత్యువాత పడితే.. ఎలా.. ఎలా.. అంటూ సతమతమవుతున్న తరుణంలో రెండోవైపు నుండి బయటకు వచ్చాడు. అయితే అతని చేతిలో ఈసారి కర్ర లేదు గాజు సీసాలున్నాయి. ఓ గాజు సీసాను రోడ్డుపైకి విసిరాడు గాజు పెంకులు అదే ప్రాంతంలో ఉన్న ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం పక్కనుండి దూసుకెళ్ళాయి. విధి నిర్వహణలో ఉన్న విశాలాంధ్ర విలేఖరి ఖదీర్‌కి గాజుపెంకులు తగిలి స్వల్పగాయమైంది. పోలీసులు అతడిని పట్టుకొనేందుకు యత్నించగా వారిపైకి ఇటుకరాళ్లు విసురుతున్నాడు. అతడిని ప్రశాంతంగా ఉండనిచ్చి పట్టుకోవాలని నిర్ణియించుకుని కాస్త విరామం ఇచ్చారు. నడుచుకొంటూ పంజా సెంటర్ నుండి అమ్మ హోటల్ వైపు వెళుతుండగా ఆటోలో అనుసరించిన పోలీసులు ఎట్టకేళకు అతడిని అదుపులోకి తీసుకొని హమ్మయ్యా అంటూ నిట్టూర్చారు. ఆ యువకుడు ఊరూపేరూ చెప్పడం లేదని పోలీసులు తెలిపారు.