కృష్ణ

నాడు దేవినేని.. నేడు పేర్ని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పాత, కొత్త కలయికతో జిల్లా పరిషత్ సర్వసభ్య చిట్ట చివరి సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో సందడి సందడిగా ముగిసింది. గత ఐదేళ్లుగా హాజరవుతూ వచ్చిన ప్రస్తుత పాలకపక్ష సభ్యులు (తెలుగుదేశం) ఒకవైపు, నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరొపక్క ఆహ్లాదకరమైన వాతావరణానికి ఏ మాత్రం భంగం కలుగకుండా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు గుప్పించుకున్నారు. గత సర్వసభ్య సమావేశం వరకు మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్కరే సమావేశాన్ని తన చేతిలోకి తీసుకుని నడిపించగా నేడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఆ స్థానంలో రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి హోదాలో పేర్ని వెంకట్రామయ్య (నాని) సమావేశాన్ని నడిపించారు. జిల్లాకు చెందిన మరో ఇరువురు మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వెల్లంపల్లి శ్రీనివాస్‌లు సమావేశానికి హాజరైనప్పటికీ పేర్ని నానినే సమావేశాన్ని లీడ్ చేయడం విశేషం. నాడు దేవినేని ఉమా అధికారులను అదిరించి బెదిరించి వారితో సభ్యులకు సమాధానం చెప్పించగా నేడు పేర్ని నాని మాత్రం అధికారులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా తమ పార్టీకి చెందిన సభ్యులను శాంతపరుస్తూ సమావేశం నిర్వహించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా చేసింది. తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ పేర్ని సమావేశాన్ని ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో నడిపించారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుడు సమస్యలపై తీవ్ర గళం విప్పేందుకు ప్రయత్నించగా ఆ సభ్యులను వారించి చిట్ట చివరి సమావేశంలో మనకు అరుపులు, కేకలు అవసరమా.. అంటూ వారిని వారించడం విశేషం. చివరి సమావేశాన్ని సరదాగా జరుపుకుందామని వారికి సూచించారు. అధికార పక్ష సభ్యుల ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలోనే ప్రతిపక్ష సభ్యులను వారించారు. అధికార పక్ష సభ్యుల మాటల్లో మనస్సు, బాధను మాత్రమే చూడండే గానీ రాజకీయాలు చూడొద్దంటూ తమ పార్టీ సభ్యులకు సూచించారు. ఎక్కడా కూడా సమావేశం అదుపు దాటే పరిస్థితులను పేర్ని నాని తీసుకురాకుండా కట్టడి చేయగలిగారు. అయితే జెడ్పీలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు చివరి సమావేశంలో తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరిని చూసిన ఆనందంలో ప్రజా సమస్యలపై తీవ్రంగా మాట్లాడే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నింటికీ పేర్ని నాని అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. రాజకీయం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, ఇప్పటి వరకు మీరంతా జెడ్పీలో బంధీలుగా ఉన్నారని, ఇప్పటి నుండి మీకు పూర్తి స్వేచ్ఛ వచ్చిందని, ఏ పని కావాలన్నా ఒక్క ఫోన్ కాల్‌తో మీమీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువస్తే సరిపోతుందని పేర్ని నాని తమ పార్టీ సభ్యులకు సూచించి వారిలో కట్టలు తెచ్చుకున్న ఆగ్రహానికి అడ్డుకట్ట వేశారు.