కృష్ణ

ఆక్వా రంగానికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: గుడివాడ డివిజన్ పరిధిలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఆక్వా రంగానికి మహర్దశ రానుందని, ఇందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరిన్ని చర్యలు తీసుకుంటారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఆదివారం స్థానిక బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి ఆక్వా ట్రేడర్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో కొల్లేరు ప్రక్షాళనకు అనేక చర్యలు తీసుకున్నారన్నారు. దీనివల్ల ఆక్వా రైతులు అభివృద్ధి చెందారని, తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. మళ్ళీ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ఆక్వా రంగానికి పూర్వ వైభవం తథ్యమన్నారు. సకాలంలో చెరువులకు నీటిని కూడా విడుదల చేయడం జరుగుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో శ్రీలక్ష్మి ఆక్వా ట్రేడర్స్ మరింత వృద్ధి సాధించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శిష్ట్లా దత్తాత్రేయులు, ఆక్వా ట్రేడర్స్ ఎండీ వీఎస్ మూర్తి, పట్టణ ప్రముఖులు సానా భోగేశ్వరరావు, రాంబాబు, కోటిరాజు, యార్లగడ్డ రవి, ఎస్ వెంకట్, రంగబాబు తదితరులు పాల్గొన్నారు.