కృష్ణ

గుట్కా విక్రేతలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఆరోగ్యానికి హాని చేసే నిషేధిత గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీగా గత నాలుగు రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న ఎం రవీంద్రనాథ్ బాబు నిషేధిత గుట్కా వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా జరిపిన విస్తృత దాడుల్లో 53 మంది గుట్కా విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుండి రూ.లక్షా 2వేలు విలువ చేసే గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో గుట్కా, ఖైనీ విక్రయాలు జిల్లాలో పేట్రేగిపోయాయి. ప్రజల బలహీనతను క్యాష్ చేసేందుకు విక్రయదారులు విచ్చలవిడిగా నిషేధిత గుట్కా, ఖైనీ విక్రయాలు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వీటిని గుట్టు చప్పుడుకాకుండా జిల్లాకు తెచ్చి విక్రయాలు జరుపుతూ కాసులు కూడబెట్టుకున్నారు. ముఖ్యంగా యువత గుట్కాకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గుట్కా విక్రేతలపై తొలి పంజా విసిరారు. గతంలో విజయవాడ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా పని చేసిన సమయంలోనూ గుట్కా విక్రయాలపై ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విస్తృత దాడులు చేశారు. ఇప్పుడు జిల్లా ఎస్పీగా నేరుగా రంగంలోకి దిగారు.
గతంలో అనేక సార్లు గుట్కా విక్రయాలు జరుపుతూ పట్టుబడ్డ వారిపై రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడేది లేదని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు తెలిపారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ సూచన మేరకు నగర, జిల్లా బహిష్కరణ విధిస్తామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలతో కూడిన గుట్కా, ఖైనీలకు యువత కూడా దూరంగా ఉండాలని కోరారు.