కృష్ణ

ఉద్యోగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న పలు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి సారిగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ ఇంతియాజ్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ సెల్‌కు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపడతామన్నారు. ఉద్యోగుల సంక్షేమ నిధి నుండి ఉద్యోగులకు రుణాలు మంజూరు కమిటీ సమావేశం నిర్వహించాలని, హెల్త్ కార్డుల ద్వారా వైద్యం పొందటంలో సమస్యలు పరిష్కారానికి రిఫరల్ ఆస్పత్రుల వారితో సమావేశం నిర్వహించాలని పశ్చిమ కృష్ణా ఎన్‌జీఓ నాయకులు సాగర్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. తూర్పు కృష్ణా ఎన్‌జీఓ అధ్యక్షుడు వుల్లి కృష్ణ జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జిల్లా కార్యాలయం ఉన్నప్పటికీ అధికారులెవ్వరూ ఉండటం లేదని, జిల్లా వ్యవసాయ శాఖ అద్దె భవనం శిథిలావస్థలో ఉందని, వ్యవసాయ శాఖ నిధులతో నిర్మించిన భవనం వారికి ఇప్పించాలని, హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు గ్రేడ్-1 ప్రమోషన్లు కల్పించాలని వినతిపత్రం అందచేశారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో అసోసియేషన్ ప్రతినిథులు విక్టర్ పాల్, శ్యామ్ తదితరులు కలెక్టరేట్‌లో ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కలెక్టర్ వినతిపత్రం అందచేశారు. నైట్ వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయటంతో పాటు మహిళా ఉద్యోగుల సౌకర్యార్ధం శిశు విహార్ ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలని, రిక్రియేషన్ క్లబ్, ఆర్‌ఓ ఫ్లాంట్ నిర్వహణ చేయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఆర్‌ఓ ఎ ప్రసాద్, డెప్యూటీ కలెక్టర్ కెఆర్‌సీసీ ఎం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.