కృష్ణ

‘పల్లె పోరు’కు మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పల్లె పోరుకు మరో అడుగు పడింది. గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్‌లు కేటాయించే విషయంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఓటర్ల కుల గణన ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత నెల 20వతేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా నుండి కుల గణన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గత 28, 29, 30 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల వారీగా కుల గణన చేపట్టారు. జూన్ 1వ తేదీ నుండి 10వతేదీ వరకు వీటిపై అభ్యంతరాలు స్వీకరించారు. ప్రజలు నుండి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు గాను 11వతేదీ నుండి 17వతేదీ వరకు ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల అనంతరం బుధవారం ఫోటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 980 గ్రామ పంచాయతీలు, 9990 పంచాయతీ వార్డులకు గాను 23లక్షల 41వేల 946 మంది ఓటర్లు త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 11లక్షల 85వేల 84 మంది, పురుష ఓటర్లు 11లక్షల 56వేల 726, ఇతరులు 136 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 609 మంది సర్వీసు ఓటర్లు ఉండటం విశేషం. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో బీసీ ఓటర్లే అత్యధికంగా ఉండటం విశేషం. 9లక్షల 79వేల 822 మంది బీసీ ఓటర్లు నమోదు అయ్యారు. వీరిలో మహిళలు 4లక్షల 95వేల 372 మంది, పురుష ఓటర్లు 4లక్షల 84వేల 392 మంది, ఇతరులు 58 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని ఓసీ ఓటర్లు ఆక్రమించారు. మొత్తం 7లక్షల 12వేల 914 మంది ఓసీ ఓటర్లకు గాను మహిళలు 3లక్షల 59వేల 91 మంది, పురుషులు 3లక్షల 59వేల 775 మంది, ఇతరులు 48గా నమోదయ్యారు. ఎస్సీలకు సంబంధించి మొత్తం 5లక్షల 73వేల 815 మంది ఓటర్లు నమోదు కాగా వీరిలో మహిళలు 2లక్షల 92వేల 12 మంది, పురుషులు 2లక్షల 81వేల 777 మంది, ఇతరులు 26 మంది ఉన్నారు. 75వేల 395 మందికి ఎస్టీ ఓటర్లకు గాను మహిళలు 38వేల 609 మంది, పురుషులు 36వేల 782 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. కుల గణన ప్రక్రియ పూర్తి కావటంతో ఇకపై రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు దృష్టి సారించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా త్వరితగతిన నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వడి వడిగా ఎన్నికల నిర్వహణ అంశాలను అధికారులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల రిజర్వేషన్లను ప్రాతిపదికన చేసుకుని రిజర్వేషన్లు కేటాయిస్తారా..? లేక కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో 2011 జనాభా లెక్కలు, ప్రస్తుత కుల గణన ఓటర్ల జాబితా ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తారా..? అనే అంశంపై స్పష్టత రాలేదు.