కృష్ణ

ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి అమ్మఒడి బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం అందచేసే రూ.15వేలతో ఎంత మంది పిల్లలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారిందని పలువురు పూర్వ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాలలో సంతోషం వెల్లివిరిస్తుండగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారింది. ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఏడాదికి రూ.25 నుండి రూ.లక్ష వరకూ వసూలు చేస్తుండగా ఎంత మంది తల్లులు తమ పిల్లలను అదనపు ఖర్చు భరాయించి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, దుస్తులు ఉచితంగా అందచేసే ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఈ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులలో నూటికి 70 మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించటాన్ని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను ఉపాధ్యాయులు అదిగమించి తమ పాఠశాల ఉనికిని కాపాడుకునేందుకే కృషి చేసే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారాయి. మండలంలో 18 పాఠశాలల్లో ఎక ఉపాధ్యాయులతో పది నుండి 16 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండటంతో ఈ పాఠశాలలో ఉనికి ప్రమాదకరంగా మారింది. అలాగే మండలంలోని అవిరిపూడి, నిడుమోలు, కారకంపాడు, ఎన్‌ఎంఆప్ కూచిపూడి ప్రాథమిక పాఠశాలల్లో కేవలం పది లోపు విద్యార్థులే విద్యను అభ్యసిస్తున్నా విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటరు దూరంలో ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామాలలో ఒక విద్యార్థి ఉన్నా పాఠశాల కొనసాగించాలన్న ఆదేశాలు ఉపాద్యాయులకు వరంగా మారాయన్న విమర్శలు వెలువడుతున్నాయి. మొవ్వ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 107 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల అంకిత భావానికి జగన్మోహనరెడ్డి పరీక్ష పెట్టినట్లుగా పలువురు పేర్కొంటున్నారు.