కృష్ణ

ఇంకెన్నాళ్లు ఇన్‌ఛార్జ్‌ల ఏలుబడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల్లో నుండి పుట్టిన కృష్ణా విశ్వ విద్యాలయం ఇన్‌ఛార్జ్‌ల ఏలుబడికే పరిమితమవుతోంది. ప్రతి జిల్లాకు ఒక విశ్వ విద్యాలయం ఉండాలన్న దృక్పధంతో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కృష్ణా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నాడు కృష్ణా విశ్వవిద్యాలయంతో పాటు ప్రారంభమైన ఇతర జిల్లాల్లోని విశ్వ విద్యాలయాలు ఒక వెలుగు వెలుగుంటే కృష్ణా విశ్వ విద్యాలయం ప్రతిష్ఠ మాత్రం మసకబారుతోంది. జిల్లాకే తలమానికంగా నిలవాల్సిన విశ్వ విద్యాలయంలో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న కొంత మంది ఆచార్యులు, సహాయాచార్యులు వర్గ వైషమ్యాలకు పోయి విశ్వ విద్యాలయం పరువును నడిబజారుకు ఈడుస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వీరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు విశ్వ విద్యాలయం మనుగడనే ప్రశ్నార్ధకంగా చేస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. విద్యా ప్రమాణాలు పెంచాల్సిన కొంత మంది అధ్యాపకులు అధిపత్య పోరు ప్రదర్శిస్తూ విశ్వ విద్యాలయం గౌరవానికి భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విశ్వ విద్యాలయంలో ఏ అంశం చూసినా వివాదాస్పదంగానే మారుతున్నాయి. గత ఫిబ్రవరి నెల వరకు ఉపకులపతి, రిజిష్ట్రార్‌లుగా కొనసాగిన సుంకరి రామకృష్ణారావు, పులిపాటి కింగ్‌లు తమ పదవీ కాలం ముగియటంతో వారి స్థానంలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం జరిగింది. ఉపకులపతిగా నూజివీడు ట్రిబుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ రామచంద్రరాజును, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా విశ్వ విద్యాలయం ఇంగ్లీష్ ప్రోఫెసర్ డా. ఎన్ ఉషలను నియమించారు. అయితే వీరి ఇరువురూ విశ్వ విద్యాలయంలో నెలకొన్న అంతర్గత పోరును చక్కబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇన్‌ఛార్జ్ ఉపకులపతి విశ్వ విద్యాలయం మొహం చూడటానికే ఇష్టపడలేదు. రిజిస్ట్రార్‌గా డా. ఎన్ ఉషాకు అసలు పాలనాపరమైన అనుభవమే లేదన్న విమర్శలు విశ్వ విద్యాలయం అధ్యాపకుల నుండే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీ రామచంద్రరాజు గత నెల 20వతేదీన వీసీ బాధ్యతల నుండి తప్పుకుంటూ రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి అందచేశారు. ఈ రాజీనామా పత్రాన్ని ప్రభుత్వం మంగళవారం ఆమోదించి ఆయన స్థానంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆచార్యునిగా పని చేస్తున్న వైకె సుందరకృష్ణకు ఇన్‌ఛార్జ్ వీసీగా బాధ్యతలు అప్పగించడం విశేషం. పూర్తి స్థాయి ఉపకులపతి, రిజిస్ట్రార్ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం గమనార్హం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపకులపతి ఎంపిక కమిటీలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని మెంబర్‌గా చేస్తూ జీవో జారీ చేశారు. దీన్ని కొంత మంది తప్పుబట్టి కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా పూర్తి స్థాయి ఉపకులపతి నియామకానికి అడ్డంకులు ఏర్పడినట్టు తెలుస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం వీటన్నింటిపై దృష్టి సారించి విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా లేకపోలేదు.