కృష్ణ

పోలీసు సమస్యల పరిష్కారానికి కమిషనరేట్‌లో గ్రీవెన్స్ సెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ 9: పోలీసు శాఖలో అధికారులు, సిబ్బంది, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ‘గ్రీవెన్స్ సెల్’ ఏర్పాటైంది. ప్రతి నెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం చేపట్టాలనే ప్రభుత్వ ఆదేశాలు, డీజీపీ ఉత్తర్వుల మేరకు నగర పోలీసు కమిషనరేట్‌లో నూతనంగా ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక విజయవంతంగా కమిషనరేట్‌లో అమలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రతి నెలా మూడో శుక్రవారం పోలీసు సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారు. ఈ వేదిక ద్వారా పోలీసు కమిషనర్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు, సిబ్బందితో, ఉద్యోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. ఇందుకు సంబంధించి విజ్ఞప్తులు, ఫిర్యాదులు, వినతులు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రారంభించిన గ్రీవెన్స్ సెల్‌లో అధికారుల నుంచి 15 ఫిర్యాదులను తీసుకున్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. వాటిని రెండు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ప్రతి మూడో శుక్రవారం పోలీసు కమిషనర్ నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌ను పోలీసు అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

నగరంలో సమర్థవంతంగా విపత్తు నివారణ
వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ (కార్పొరేషన్), జూలై 19: నగరంలో విపత్తు నివారణను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం వీఎంసీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ యూన్‌డీపీ సంస్థ వారిచే నగర విపత్తుల ముఖచిత్రంపై రూపొందించిన బేస్ లైన్ రిపోర్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ దీనిలో ప్రధానంగా వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం, అధిక ఉష్ణోగ్రతల నమోదు తదితర అంశాలపై ముందస్తు హెచ్చరిక, నష్ట నివారణకు చర్యలు, యుఎన్‌డీపీ - పబ్లిక్ ప్రైవేట్ భాగస్వాములో భాగంగా ఆగాఖాన్ అనే అంతర్జాతీయ సంస్థ వారి సహకారంతో నగరానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. కొండ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థకు అధిక వర్షాల వలన తీవ్ర ఆటంకం కలుగుతోందని, దీని నివారణకు కొండ ప్రాంతాల్లో అధిక మొత్తంలో చెట్లు నాటితే పై నుంచి వచ్చే మట్టిని తగ్గించవచ్చన్నారు. ఈ విషయాన్ని అధ్యయనం చేయడానికి టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ముంబాయి సహకారం తీసుకోనున్నట్టు తెలిపిన ఆయన నగర భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. అదేవిధంగా ఆగాఖాన్ సంస్థ ప్రతిపాదించిన నగర పాలక విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మళ్లీ అధ్యయనం చేసి సమగ్ర కమాండ్ కంట్రోల్ రూమ్ బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటుపై ఏపీఎస్‌డీఎంఏ వారి సాంకేతిక సహకారం తీసుకోవాలని, నగరంలోని అన్ని ప్రాంతాలు కలిసే విధంగా ప్రతిపాదనలు చేయాలన్నారు. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులను యుఎన్‌డీపీ ద్వారా సేకరించాలన్నారు. యుఎన్‌డీపీ - వీవీఎన్ టెక్నాలజీ సంస్థ చేపట్టే పైలెట్ ప్రాజెక్టు కింద 52వ డివిజన్ ను ఎంపిక చేసుకోవాలన్నారు. పై సమావేశంలో ఆగాఖాన్ సంస్థ ప్రతినిధి మధుకర్, వీవీఎన్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, యుఎన్‌డీపీ ప్రతినిధి ప్రభుచరణ్, వీఎంసీ ఇన్‌చార్జిసీఈ జేవీ రామకృష్ణ, సీటీ ప్లానర్ బీ లక్ష్మణరావు, అదనపు కమిషనర్ (జనరల్) కె శకుంతల దేవి, అదనపు కమిషనర్ ప్రాజెక్ట్సు యు శారద, సీఎంహెచ్‌ఓ కె అర్జునరావు, ఆర్‌ఎఫ్‌ఓ ఉదయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

స్పందన అర్జీల సమస్య పరిష్కారంపై
కమిషనర్ వెంకటేష్ క్షేత్ర స్థాయి పరిశీలన
విజయవాడ (కార్పొరేషన్), జూలై 19: ప్రజా సేవల పరిష్కారమే ధ్యేయం గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమంలో అందిన సమస్య పరిష్కారంపై వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయి పరిశీలన చేశా రు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం నగరంలోని సూర్యారావుపేట, పీసపాటి వారి వీధిలో డ్రైన్లపై ర్యాంపు ల నిర్మాణం వల్ల పిల్లలు, వృద్ధులు తీ వ్ర ఇబ్బంది పడుతున్నారన్న అంశంపై వచ్చిన ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటన్న విషయంపై కమిషనర్ పరిశీలించారు. టౌన్ ప్లానిం గ్ అధికారులు ర్యాంప్‌లను తొలగించి నా అర్జీదారుని ప్రహరి గోడ సమస్య అంశం కోర్టు పరిధిలో ఉన్నందున నగర పాలక సంస్థ నుంచి ఎటువంటి చర్యలు లేవని, అర్జీదారునికి వివరిస్తూ అనధికార కట్టడాలు తొలగించే సమయంలో ప్రహరి గోడకు ఏర్పడిన రం ధ్రం పూడ్చివేయాలని అధికారులకు సూచించారు. విష్ణువర్ధన్‌రావు వీధిలో నిలిచిన వర్షపు నీటిని సైడ్ డ్రైన్‌కు మ ళ్లించాలని, లేకుంటే ఎయిర్ టెక్ మిష న్ ద్వారా తోడించాలని అధికారులకు సూచించారు. ఎంజీ రోడ్డు నుంచి అ య్యప్పనగర్ వరకూ గల ప్రధాన రహదారిని పర్యవేక్షించిన సందర్భంలో బెంజిసర్కిల్ నుంచి ట్రెండ్ సెట్ వద్ద రోడ్‌పై నిల్వ ఉన్న వర్షం నీటిని సైడ్ డ్రైన్‌లోకి మళ్ళించాలన్నారు. కనకదుర్గమ్మ వారధి పక్కన గల ఉడా పార్కు లో చెత్త చెదారం, వ్యర్ధాలు ఉండడం గమనించిన కమిషనర్ వాటిని తొలగించి పార్కు ఏర్పాటు చేయాలన్నారు.

పార్కులో కమ్యూనిటీ హాలు నిర్మించరూ!
విజయవాడ పశ్చిమ, జూలై 19: పశ్చిమలోని 36వ డివిజన్ ఫోర్‌మెన్ బంగ్లా ప్రాంతం కొండపై భాగాన నివాసముందే వారికి ఎర్రకట్ట పక్కనగల పార్కు స్థలాన్ని కమ్యూనిటీ హాలుకు కేటాయించి నిర్మాణం చేపట్టాలని కొండ ప్రాంతవాసుల కమ్యూనిటీ హాల్ సాధన సమితి సభ్యులు కోరుతున్నారు. శుక్రవారం చుట్టల కంపెనీ ఎదుటగల పార్కులో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా వైకాపా మైనార్టీ విభాగం అధ్యక్షులు గౌస్‌మొహద్దీన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కమ్యూనిటీహాలు నిర్మాణం కోసం తానూ పాటు పడతానని గౌస్‌మొహిద్దీన్ హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ షేక్ బిజాన్‌బి కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఎన్నో ఏళ్ళ నుండి తాము కమ్యూనిటీహాలు కోసం ఎదురుచూస్తున్నామని వైకాపా పాలనలోనైనా కార్యరూపం దాల్చాలని సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బడుగు వెంకటేశ్వరరావు, యలకల చలంబాబు, ఆకుల ధనరాజు, వెంకటలక్ష్మి, పుల్లయ్య, షేక్ జానీ, వడ్డాది సురేష్, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో
ఐఏఎస్ అధికారిణి వాణీమోహన్
ఇంద్రకీలాద్రి, జూలై 19: కనకదుర్గమ్మను శుక్రవారం ఉదయం ఆర్కియాలజీ మ్యూజియమ్ కమిషనర్ జి వాణీమోహన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లిఖార్జున మహా మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఈవో కోటేశ్వరమ్మ అమ్మవారి శేష వస్త్రం, ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు.