కృష్ణ

వాతావరణ మార్పులతో ఆక్వా రంగం అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 12: వాతావరణ మార్పులతో ఆక్వా రంగం అతలాకుతలమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, అప్పుడే అకాల వర్షాలు, మరలా ఉక్కపోతలతో వాతావరణం ఆక్వా రంగాన్ని గడగడలాడిస్తోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగినా, వర్షం కురిసినా, ఉక్కపోత ఉన్నా ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. ఈ సమయంలో రొయ్యలు, చేపలు ఒడ్డుకు వచ్చి మృత్యువాత పడతాయి. దీంతో చెరువు మొత్తం ఖాళీ అవుతుంది. ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు ఏరియేటర్లను తిప్పుతారు. అయితే ఇవి రాత్రీ పగలు తేడా లేకుండా గిర్రున తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఖర్చులు భారీగా పెట్టాల్సి వస్తోంది. ఇంతా ఖర్చు చేసినా ఆక్సిజన్ అందక రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా వనామీ రొయ్యల చెరువు సాగు చేయాలంటే దాదాపు రూ.4 నుండి రూ.5లక్షలకు పైగా ఖర్చుచేయాలని రైతులు పేర్కొంటున్నారు. అయితే మూడు నెలల్లో రొయ్యలు పట్టుబడి చేయాల్సి ఉంటుందని, ఈ మూడు నెలల్లోనే ఈ మొత్తాన్ని ఖర్చుచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో పంట నెలరోజుల్లో చేతికి వస్తుందనుకున్న తరుణంలో ఉక్కపోతలు, ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల వల్ల ఆక్సిజన్ అందక రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని పెంపకందారులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే అవసరమైన తీపినీరు లేకపోవటంతో చెరువుల్లో నీటిమట్టం భారీగా తగ్గింది. ఆక్సిజన్ సమస్య తలెత్తడంతో చేపలు కూడా భారీగా మృత్యువాత పడుతున్నాయి. వీటిని రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అధిక మొత్తంలో ఖర్చుచేసి చెరువుల్లో ఆక్సిజన్ పుట్టించేందుకు మందులను వేస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన లీజు, మేత ధరలు ఆక్వా రైతులను కుంగదీస్తుండగా వాతావరణం మరింతగా ఆవేదనకు గురిచేస్తోంది. ఏదిఏమైనా ఈ ఏడాది ఆక్వా రంగం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు మారింది.