కృష్ణ

ఉధృతంగా కృష్ణమ్మ ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, : తోట్లవల్లూరు మండలంలో శుక్రవారం ఉధృతంగా కృష్ణమ్మ ప్రవాహం కొనసాగుతోంది. మండలంలోని తోడేళ్ళదిబ్బలంక, కాళింగదిబ్బలంక, పాములలంక, తుమ్మలపచ్చిక, పొట్టిదిబ్బలంక, కనిగిరిలంక, మునకలపల్లిలంక గ్రామాల్లో వరద నీరు ప్రహహిస్తోంది. మండలంలోని లంక గ్రామాల్లోని పంటలు వరద నీట మునిగాయి. వరద ఉధృతంగా పెరగటంతో రైతులు పంటలు కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది రైతులు పడవలపై లంకలకు వెళ్ళి విద్యుత్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లోని భూముల్లో వరద నీరు ప్రవేశించటంతో వందలాది ఎకరాల్లోని కంద, పసుపు, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలు రెండు రోజులుగా నీటిలో నానుతున్నాయి. లంక గ్రామాల్లో కొన్నిచోట్ల వరద ఉధృతికి విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 7లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రహిస్తోందని తహశీల్దార్ జి దుర్గాప్రసాద్ తెలిపారు. సాయంత్రానికి 9లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని తెలిపారు. కనుక లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అధికారులకు సహకరించాలని తెలిపారు. అలాగే తోట్లవల్లూరులో కృష్ణానదీ రేవు వద్ద వరద ఉధృతిని జాయింట్ కలెక్టర్ కె మాధవీలత అధికారులతో కలసి పరిశీలించారు.