కృష్ణ

వరద ప్రభావిత గ్రామాల్లో జేసీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల, : మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన లంకపల్లి, ఐనవూరు గ్రామాల్లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత పర్యటించారు. తహశీల్దార్ శివయ్యతో కలిసి ముంపుకు గురైన పొలాలు, వరద పరిస్థితిని సమీక్షించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో నాంచారరావు, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా వరద కారణంగా లంకపల్లి, లంకపల్లి లంక, ఐనవూరులో మెట్ట పొలాలు ముంపుకు గురయ్యాయి. సుమారు 250 హెక్టార్లలో పంట వరద నీటి మునిగినట్టు తెలుస్తోంది. అరటి, కంద, పసుపు, కూరగాయతోటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.

బాలిక గల్లంతు
కంచికచర్ల, ఆగస్టు 16: కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద గురువారం సాయంత్రం పడవ బోల్తాకొట్టటంతో 11 సంవత్సరాల బాలిక గల్లంతైంది. ఇక్కడ పెద్ద పడవ ఏర్పాటు చేయాలని గ్రామ మాజీ సర్పంచ్ కొర్లగుంట బుచ్చియ్య, గ్రామ ప్రజలు కోరినా ఐదుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉన్న పడవను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో చెవిటికల్లు నుండి ఈ పడవ ద్వారా ప్రజలను మెరక ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న కంచర్ల తులసీప్రియ (11) అక్క, తండ్రితో పాటు మెరక ప్రాంతానికి వెళ్లేందుకు మరో ఆరుగురితో పడవ ఎక్కి వెళ్తుండగా నీటిలో గేదె ఎదురు వస్తుండటంతో పడవలో ఉన్న అందరూ ఒక వైపు రావటంతో పడవ నీటిలో బోల్తా పడింది. పడవలో ఉన్న ఏడుగురు క్షేమంగా రాగా తులసీప్రియ నీటిలో గల్లంతైంది. స్థానికులు శుక్రవారం రాత్రి 7 గంటల వరకు వెతికినా మృతదేహం లభ్యం కాలేదు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా గాలింపు చర్యలు చేపట్టింది.