కృష్ణ

ప్రకృతి వైపరీత్యాల నుండి దివిసీమ వాసులను రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, : తరుచూ ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివిసీమ ప్రజానీకం గత కొన్ని రోజులుగా కృష్ణానదికి వస్తున్న వరద కారణంగా పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సమస్యను ఎదుర్కొవల్సి వస్తోందని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్‌ను ముంచి వేసిన వరద నీటి ఉధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి పరంగా వచ్చే ముంపులను మానవాళి నిలువరించలేదని, అయితే వాటి నుండి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దివిసీమలో పలు తీర గ్రామాల ప్రజలు వరద బారి నుండి బయట పడేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాలన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు యాసం చిట్టిబాబు, వర్రె రాంబాబు, మండవ బాలవర్ధిరావు, తుంగల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

ముంచుకొస్తున్న ముప్పు
బ్యారేజీకి 7.50 లక్షల క్యూసెక్కుల వరద పోటు
విజయవాడ పశ్చిమ, ఆగస్టు 16: ప్రజలు భయపడుతున్నట్లుగానే జరుగుతుంది. శుక్రవారం రాత్రికి ప్రకాశం బ్యారేజీ వద్ద 7.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. 70 గేట్లు ఎత్తేసిన నీటి పారుదలశాఖ వారు వరద నీరం తా దిగువకు వదలడంతో సముద్రం వై పుగా కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. బ్యారేజీ వద్ద 18 అడుగుల నీటిమట్టం నమోదైంది. దాంతో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం రాత్రి పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకాశం బ్యారేజీని పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. గురువారం ఉదయం 6-10 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా రానురాను ప్రవాహ వేగం పెరిగింది. ఎగువున శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుండి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి పరుగులు తీస్తుంది. భవానీపురం ప్రాంతంలోని కరకట్ట ప్రాంతవాసులు గురువారం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. శుక్రవారం నాటికి మరో 1.40 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రెండు రోజుల క్రితం ఫెర్రి పవిత్ర సంఘమం నుండి కొట్టుకువచ్చిన రెండు ఇసుక పడవల్లో ఒకటి ప్రకాశం బ్యారేజీ వద్ద 67,68 ఖానాల వద్ద మునిగిపోయిన విషయం విధితమే కాగా శుక్రవారం ఉదయం వరద తాకిడి ఎక్కవవ్వడంతో అప్పటి వరకూ అక్కడ ఉన్న ఇసుకబోటు బ్యారేజీకి దిగువ భాగానికి కొట్టుకుపోయింది. దాని ఆనవళ్లు కూడా లేకుండాపోయింది. వరద వల్ల బ్యారేజీ వద్ద కృష్ణమ్మ నురగలు కక్కతూ ముందుకు దూకుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకున్నది. నది దిగువ భాగాన లోతట్టు ప్రాంతాల్లోని లంకల గ్రామాల వాసులను భయకంపితులను చేస్తుంది. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు నీట మునిగాయి. వరద విపత్తును ఎదుర్కోడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ సిద్ధంగా ఉంచారు. పడవలు గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.
బ్యారేజీపై భయపెడుతున్న పిట్టగోడలు
వరద తాకిడి వల్ల లోతట్టు ప్రాంతవాసులు గుండె గుప్పెట పట్టుకుంటుండగా ప్రకాశం బ్యారేజీ వద్ద పుట్‌పాట్ పాదచారులకు మరో భయం వెంటాడుతుంది. బ్యారేజీ 24వ ఖానా వద్ద లాకుల వైపు పిట్టగోడ వాలింది. సందర్శకులు ఏమాత్రం ఆ గోడను ఆనుకొన్నాగాని విరిగిపడే అవకాశముంది. అలాగే 39వ ఖానా (మిగతా 6లో)
వద్ద నంది దిగువ వైపు పుట్‌పాత్ పిట్టగోడ కూడా విరిగిపోయింది. పాదచారులు గాని సందర్శకులు గాని ఏమరుపాటున దానికి ఆనుకొన్నగాని అది విరిగిపడే ప్రమాదం ఉంది. విషయం గ్రహించిన పోలీసులు ఆ రెండు ఖానాల వద్ద ప్రజలు సంచరించకుండా అడ్డుపడుతున్నారు. ఇదే విషయాన్ని లాకుల సూపరింటెండెంట్ ఉదయభాస్కర్ దృష్టికి ‘్భమి’ తీసుకెళ్ళగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు

వరద నీటిలో 12 గ్రామాలు ముంపు
విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 16: జిల్లాలో వరదల కారణంగా 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయ ని ఆయా గ్రామాలలోని ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా యుద్దప్రాతిపదికపై సహాయ చర్యలు చేపట్టామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో శుక్రవారం రాత్రి వరద పరిస్థితి జి ల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణానదికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వరద నీటి కా రణంగా జిల్లాలోని 18 మండలాలకు చెందిన 24 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయన్నారు. వీటిలో 12 గ్రామాలు వరద నీటి ముంపునకు గురయ్యాయని, ఆయా గ్రామాలలోని 8 వేల 100 మందికిపైగా ప్రజలను 41 పునరావాస కేంద్రాలకు ప్రాంతాలకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. వారికి ఇప్పటివరకు 14వేల 413 ఆహార పొట్లాలు, 42వేల వాటర్ ప్యాకెట్లు అందించడం జరిగిందన్నారు. 35 వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. శుక్రవారం రాత్రికి 8 లక్షల క్యూసెక్యుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకునే అవకాశం ఉందని, రానున్న రెండు మూడు రోజుల వరకు రోజుకు 6 లక్షల క్యూసెక్కుల పైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ఆర్మీ, నేవి నుండి కూడా దళాల సేవలను వినియోగించుకుంటామన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు విజయవాడ, మచిలీపట్నంలో ఎర్పాటు చేశామన్నారు. జిల్లాలో వరద నీటి కారణంగా ఇంతవరకు 2939 హెక్టార్లలో వరి పంటకు 1398 హెక్టార్లలో ఉద్యానవన పంటలు 20 హెక్టార్లలో సెరీకల్చర్ పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాధమికంగా అంచనా వేశామన్నారు. జిల్లాలో ఇంతవరకు 160 గృహాలు దెబ్బతిన్నాయని, వాటిలో 60 పక్కా గృహాలు పూర్తిగాను, మరో 40 కచ్చా గృహాలు పూర్తిగాను, 40 కచ్చాగృహాలు బాగా దెబ్బతినగా 20 గుడిసెలు నష్టం వాటిల్లగా 315 గృహాలు 24 గంటలకు పైగా వరద నీటమునిగి ఉన్నాయని, మొత్తం మీద 36 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ కృష్ణానదికి వరద ఉధృతి కారణంగా కృష్ణానది పరవళ్ళు చూసేందుకు ప్రకాశం బ్యారేజ్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నదన్నారు. పర్యాటకులు సెల్ఫీలతో ప్రమాదానికి గురికాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భద్రతకు ఘాట్ల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. ప్రకాశం బ్యారేజ్‌పై పర్యాటకుల కార్లు కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నందున కార్లు భారీ వాహనాల రాకపోకలకు అంక్షలు విధించడం జరిగిందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు క్విక్ రియాక్షన్ టీమ్‌లను సిద్ధంగా ఉంచామన్నారు. వరదల కారణంగా ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే 100 లేదా 0866 2579999, 7328909090 ఫోన్ చేయాలని 9100108101కు వాట్సాప్ చేయాలన్నారు. ఈసమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ఇరిగేషన్ ఎస్‌ఈ చౌదరి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఆధార్‌కు అన్ని అవస్థలే
విజయవాడ (సిటీ), ఆగస్టు 16: రేషన్ కార్డు, పెన్షన్, విద్యార్థుల ఉపకార వేతనం, రైతులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు అకౌంట్, బ్యాంకులో రుణం, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం కావాలన్నా అన్నింటికీ ఒకే ఒక్క ఆధారం ఆధార్ మాత్రమే. అటువంటి ఆధార్ కోసం అందరూ అవస్థలు పడాల్సిన పరిస్థితి నేడు వచ్చింది. రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకునేందుకు కేవైసీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో, పింఛన్ వయస్సును 65నుండి 60కి తగ్గిన పరిస్థితుల్లో తమ పూర్తి వివరాలను ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అన్నింటికీ ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఆధార్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితుల్లో ఆధార్ నమోదుతో పాటు సవరణలు చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల ద్వారా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ప్రతీ పనికి ఆధార్ తప్పని సరి అవ్వడంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు పెద్ద ఎత్తునవెళ్తుండటంతో కేంద్రాలు జనంతో కిటకిట లాడుతున్నాయి. జనాభాకు అనుగుణంగా జిల్లాతో పాటు నగరంలో కూడా సరిపడినన్ని మీ సేవా కేంద్రాలు లేని కారణంగా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లలో ప్రజలు నిరీక్షించాల్సి వస్తోంది. ఉన్నకొద్ది మీ సేవా కేంద్రాల వద్ద డిమాండ్, అవసరాలను ఆసరాగా చేసుకుని మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఛార్జీలను ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఆధార్‌లో వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటూ వస్తున్నాయి. అయితే మారుతున్న పరిస్థితుల్లో పుట్టిన తేదీ, నెల కూడా నమోదు తప్పనిసరి చేయడంతో అందరూ ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆధార్ కార్డులో పుట్టిన తేదీలను పూర్తిగా నమోదు చేసుకుని వారు 60శాతం పైగా ఉన్నారు. ఆధార్ కార్డుకు వేలి ముద్రలు కూడా అతి ముఖ్యమైనవి. రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరు కనీసం ఒక్కసారైనా రేషన్ షాపునకు వెళ్లి ఫింగర్ ప్రింట్‌తో రేషన్ తీసుకోవాలి. కాని ప్రతీ సారి ఒకరే రేషన్ షాపునకు వెళ్తున్నారు. రేషన్ షాపునకు కొత్తవారు వెళ్లిన సందర్భంలో ఫింగర్ ప్రింట్ సరికాకపోవడంతో మళ్లీ ఫింగర్ ప్రింట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అలాగే ఉపాధి హామీ పనులు చేసేవారు కూడా తన బ్యాంకు నెంబర్‌కు, ఆధార్‌కు ఫోన్ నెంబర్‌ను తప్పనిరిగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ వయస్సును 65ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించడంతో పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. దీని కోసం వయస్సు ధ్రువీకరణ ఆధార్‌లో తప్పనిసరి చేయడంతో అందరూ ఆధార్ సెంటర్లకు వయస్సు నమోదు చేసుకునేందుకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇలా అన్నింటి కోసం ఆధార్ సెంటర్లకు అందరూ పరుగులు పెడుతున్న పరిస్థితులో మీ సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.
నమోదుకు టోకెన్ల పద్ధతి
నిత్య జీవితంలో అన్నింటికీ ముడిపడి ఉన్న ఆధార్‌లో సవరణల కోసం ప్రజలు పెద్దఎత్తున వస్తుండటంతో మీసేవా కేంద్రాల వద్ద టోకెన్ల పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఉదయం 9గంటలకే పెద్ద సంఖ్యలో సేవా కేంద్రాల వద్దకు చేరుకుంటుండటంతో నిర్వాహకులు క్రమపద్ధతిలో నమోదు చేసేందుకు టోకెన్ల పద్ధతిని అవలంభిస్తున్నారు. రోజుకు 50 నుండి 100 మంది వరకు టోకెన్లు ఇస్తున్న నిర్వాహకులు, ఒక వేళ టోకెన్లు ఇచ్చిన వారికి ఆ రోజుకు పనికాకపోతే మరుసటి రోజు రమ్మని చెబుతున్నారు. టోకెన్లు ఉన్నవారికే ఆధార్ నమోదు సవరణలు చేస్తున్నారు. ఆధార్‌లో సవరణల కోసం ఒక్కో మనిషికి కొన్ని సందర్భాల్లో 20 నుండి 30 నిముషాల సమయం పడుతుండగా, సర్వర్ బిజీగా ఉన్న సందర్భంలో మరింత ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాల్లో సేవలు ప్రియంగా మారుతున్నాయి. మీ సేవా కేంద్రాల్లో అందించే సేవలకు సంబంధించి నిర్థిష్టమైన రుసుం మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ప్రస్తుతం ఆధార్ నమోదు కోసం పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే అధనంగా 20 నుండి 100ల వరకు వసూలు చేస్తున్నారు. పింఛన్ కోసం వయస్సు ధ్రువీకరణ కోసం వచ్చే వారి వద్దే బలవంతంగా డిమాండ్ చేసి మరీ అధికంగా వసూలు చేస్తున్నారు. అత్యవసరం అంటున్న వారివి ముందుగా నమోదు చేస్తూ పెద్ద ఎత్తున అదనంగా రుసుములను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అదనపు వసూళ్లకు పాల్పడుతున్న మీ సేవా కేంద్రాల నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ద్విచ్రక వాహనాలకు మాత్రమే అనుమతి
పోలీసులు ఆధీనంలోకి ప్రకాశం బ్యారేజీ
విజయవాడ పశ్చిమ, ఆగస్టు 16: కృష్ణానదికి వరద తాకిడి ఎక్కవవ్వడంతో పశ్చిమ పోలీసులు ప్రకాశం బ్యారేజీని ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం రాత్రి నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్న సంఘటనతో బ్యారేజీపై రద్దీని నియంత్రించడానికి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రత్యేక పహారా కాశారు. బ్యారేజీపై ఆటోలు, చిన్నకారులు, మినీ వ్యానులు రాకపోకలు నిషేధించారు. కేవలం దిచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. బ్యారేజీపై పాదచారులను సైతం నడవనీయలేదని, కృష్ణానది వరదను వీక్షించడానికి వచ్చిన వారంతా వెనుతిరగాల్సి వచ్చింది. సందర్శకులను నియంత్రించడంలో ఇటు కృష్ణవేణి విగ్రహం వద్ద అటు గుంటూరు వైపు లోటస్ హోటల్, సీతానగరంవైపు సందర్శకులు బారులు తీరారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వెస్ట్‌జోన్ ఎసీపీ కె సుధాకర్ పర్యవేక్షణలో సందర్శకులను నియంత్రించారు. బ్యారేజీ వద్ద 20 మంది అదనపు బలగాలను, ముగ్గురు సీఐలను, ముగ్గురు ఎస్‌ఐలను, సిబ్బందిని కేటాయించామని కె సుధాకర్ తెలిపారు. ట్రాఫిక్ సీఐలు సుధాకర్, నాగరాజు, వన్‌టౌన్ సీఐ కాశీ విశ్వనాద్, భవానీపురం సీఐ మోహన్‌రెడ్డి తమ సిబ్బందితో ట్రాఫిక్‌ను నియంత్రించారు.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలింపు * కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 16: జిల్లాలో ఎటువంటి వరద పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి బాధితులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. వరద బాధితులకు ఏర్పా టు చేసిన భోజనాన్ని పరిశీలించి వారికి స్వయంగా వడ్డించారు. ఈసందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం బ్యా రేజీకి 8 లక్షల క్యూసెక్కులకు పైగా వర ద నీరు పోటెత్తుతుందని ఇది 10 లక్ష ల క్యూసెక్కులకు చేరవచ్చన్నారు. జిల్లాలో వరద పరిస్థితి మరో 4నుండి 5 రోజుల వరకు ఉండవచ్చని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. జిల్లా లో వరదల కారణంగా ఎటువంటి ప్రా ణ, ఆస్థి నష్టాలు సంభవించకుండా ప టిష్టమైన చర్యలు తీసుకున్నామని, ముంపు ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. జిల్లా లో ఇంతవరకు 25 వరద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాం తాల ప్రజలను ఈకేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. కొన్ని ప్రాంతాలలోని ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని, వరద ఉధృతిని ప్రమాద పరిస్థితులను వారికి తెలియజేసి ప్రమాద వరద తగ్గుముఖం పట్టిన వెంటనే వారి స్వంత ప్రాంతాలకు చేరవచ్చని నచ్చ చెప్పి పునరావాస కేంద్రాలకు జిల్లా యం త్రాంగం తీసుకువస్తుందన్నారు. వరద ప్రమాదం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అధికారులు ఏర్పాటు చే సిన పునరావాస కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తారకారామనగర్‌కు చెందిన 600 మందిని తరలించామని పేర్కొన్నారు. వరద ప్రమాద నివారణ చర్యలు నిమిత్తం ఆయా మండల తహశీల్దార్లు టిఆర్ 27 పద్ధు కింద నిధులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాలలోని ప్రజలకు భోజన, త్రాగునీరు వంటి సౌకర్యాలు పూర్తిగా కల్పించడం జరిగిందన్నారు. అంతేకాక తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయడం జరిగిందని, వైద్య శిబిరాలలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రత వాతావరణం కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్రాలలో పూర్తిస్థాయి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ చక్రపాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మరియు ప్రత్యేక అధికారి కె రాజ్యలక్ష్మీ, తహశీల్ధార్ ఎ రవీంద్ర, తదితరులు ఉన్నారు.

ప్రకాశం బ్యారేజీపై
ట్రాఫిక్ ఆంక్షలు
వరద ఉధృతిని పరిశీలించిన సీపీ
విజయవాడ (క్రైం), ఆగస్టు 16: కృష్ణానది వ