కృష్ణ

నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు : కృష్ణానది వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం చేస్తామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఆదివారం బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే కొలసు పార్థసారధి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ లంక పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా వల్లూరుపాలెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రంలో లంక ప్రజలను వారు పరామర్శించారు. వారికి ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోట్లవల్లూరు రేవు వద్ద కృష్ణానదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ కృష్ణానదికి వరద ఉద్ధృతంగా రావటం వల్ల లంకల్లోని పంటలు అన్ని ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కంద, అరటి, పసుపు, తమలపాకు పంటలు వేసిన రైతులు ఎకరానికి రూ.75వేల నుంచి రూ.లక్ష దాకా పెట్టుబడులు పెట్టి నష్టపోయారని తెలిపారు. పంట నష్ట జరిగిన వారిలో ఎక్కువ శాతం కౌలు రైతులే ఉన్నారని తెలుస్తోందని చెప్పారు. సుమారు 15వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అంచనా వేశామని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి సూచనతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, నదీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా నుంచి రాగానే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రైతుల యొక్క నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువెళి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. లంకల్లో పంట నష్టపోయిన రైతులందరికి మినుము, మొక్కజొన్న విత్తనాలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడామని తెలిపారు. ఇప్పుడు జీవనోపాధి కోల్పోయిన రైతులకు, లంక ప్రజలకు కొన్ని రోజులు రేషన్ ఇచ్చేలా కలెక్టర్‌తో మాట్లాడతామని తెలిపారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నష్టపోయిన వారికి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఎంపీ వెంట పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, పామ్రరు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, మాజీ ఎంపీపీ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, మండల వైసీపీ కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, మర్రిరెడ్డి శేషురెడ్డి, కిలారం శ్రీనివాసరావు, తహశీల్దార్ జి దుర్గాప్రసాద్, ఎంపిడిఓ టి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.