కృష్ణ

ప్రజాసేవే పరమావధిగాగా విధులు నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : తమ విధిని ప్రజాసేవగా భావించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా వార్డు వలంటీర్లు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కుటుంబ ప్రాథమిక సమాచార సేకరణపై శుక్రవారం స్థానిక హిందూ కళాశాల ఆడిటోరియంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వార్డు వలంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పట్ల పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. లాభం కోసం, జీతం కోసం కాకుండా పది మందికి సేవ చేయాలన్న ధృక్పథంతో విధులు నిర్వర్తించాలన్నారు. అభయహస్తం పెన్షన్ తీసుకుంటున్న వారు ఇతర పెన్షన్లు పొందేందుకు అర్హులేనన్నారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన అంగీకారం తెలిపారన్నారు. ఓనర్ కంటే డ్రైవర్‌కు మినహాయింపు ఉంటుందన్నారు. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా జీతాలు పొందే వారికి రేషన్ నిలుపుదల చేయడం జరిగిందని, దీనిపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని మరో వలంటీర్ ప్రశ్నకు మంత్రి పేర్ని సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో 1.45కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, ప్రతి ఏడాది ప్రభుత్వం రూ.9వేలకోట్లు సబ్సిడీ రూపంలో ప్రజలకు రేషన్ అందిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు పొందడంలో, ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డు పొందడంలో అధిక శాతం ప్రజలు తెల్ల రేషన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. రూ.75వేలు వార్షిక ఆదాయ నిబంధన పెంపునకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటైన అనంతరం రేషన్ కార్డుకు అర్జీ పెట్టిన 72 గంటల్లోగా వారి అర్హతలను పరిశీలించి కార్డు మంజూరు చేస్తామన్నారు. ఒక రేషన్ కార్డుకు ప్రస్తుతం ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నామని, రెండవ పెన్షన్‌పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి శ్రీకాకుళం జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1వతేదీన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒకే రోజు రాష్టమ్రంతా సన్న బియ్యం పంపిణీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు గోడౌన్‌లలో నిల్వ ఉన్న బియ్యాన్ని వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో ఇచ్చిన జీ ప్లస్ త్రీ గృహాలను పునః పరిశీలించడం జరుగుతుందన్నారు. రానున్న ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల నివేశన స్థలాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం ఇచ్చి గృహం నిర్మిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ గృహాలు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన జీ ప్లస్ త్రీ గృహ లబ్ధిదారుల అర్హతలు రీ వెరిఫికేషన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్, తహశీల్దార్ సునీల్ బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కె చంద్రిక తదితరులు పాల్గొన్నారు.
ఇలావుండగా అంతకు ముందు ఆడిటోరియంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ప్రకాశం పంతులు చిత్రపటానికి మంత్రి పేర్ని నాని, ఆర్డీవో జె ఉదయ భాస్కర్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు జీవితం ఆదర్శప్రాయమైందని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మాజీ కౌన్సిలర్ లంకా సూరిబాబు, గూడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.