కృష్ణ

సముద్రపు ఉప్పునీటి నుండి భూములను కాపాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, : సముద్రపు ఉప్పునీటి నుండి పంట భూములను కాపాడుతామని, రెగ్యులేటర్ నిర్మాణం ఏర్పాటు చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఏలూరు ఏంపీ కోటగిరి శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రాంబాబు రాజులతో కలిసి ఎంపీ కోటగిరి శ్రీ్ధర్ అండర్ తనేల్ వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి యేటా లక్షలాది ఎకరాలను కబళిస్తున్న ఉప్పునీటిని అడ్డుకునేందుకు సముద్రపు మార్గాలలోని డ్రైన్‌లలో రెగ్యులేటర్ నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, దీని కోసమే ముగ్గురు శాసనసభ్యులు, ఒక ఎంపీ కలిసి వచ్చామన్నారు. ఉప్పునీటి సమస్యను శాశ్వితంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి ఉండి, కైకలూరు, పెడన నియోజకవర్గ నాయకులు అండర్ తనేల్ వద్ద చర్చలు జరిపారు. పెదలంక డ్రైన్‌కు సంబంధించి ఎగువన రెగ్యులేటర్ నిర్మాణం చేపడితే కైకలూరు, పెడన, ఉండి నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే జోగి రమేష్ ఏంపీ శ్రీ్ధర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన మ్యాప్‌లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రానున్న మూడు సంవత్సరాలలో సమస్యను శాశ్వితంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం పల్లెపాలెం వద్ద లోసరి వంతెనను, కొత్త కాలువపై నిర్మించిన వంతెనను నాయకులు పరిశీలించారు.