కృష్ణ

పంటు, పడవల నిర్వహణపై నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక : మండలంలోని ఎదురుమొండి- ఏటిమొగ మధ్య నిర్వహిస్తున్న పంటు విషయంలో, పడవల విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా ఆయా యజమానులు వ్యవహరించాల్సి ఉంటుందని తహశీల్దార్ మద్దినేని వెంకట్రామయ్య చెప్పారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పంటు నిర్వాహకులు తమ పంటుకు లైసెన్సు, పర్మిట్, ఫైర్‌సెట్లు, లైఫ్ జాకెట్లను విధిగా కలిగి ఉండాలని చెప్పారు. పంటు నిర్వహణకు ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్‌ను పోర్టు ట్రస్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రూట్ అనుమతి, సరంగు లైసెన్సులను జలవనరుల శాఖ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎదురుమొండి- ఏటిమొగ మధ్య నిర్వహిస్తున్న పంటు నిర్వాహకులు వీటిపై ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఆయా అధికారులు నుంచి అనుమతులు అందాల్సి ఉందన్నారు. పంటుపై ప్రయాణం చేసేవారి భద్రతకు పంటు నిర్వాహకులు లైఫ్ జాకెట్లను తప్పని సరిగా ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. ఈ నిబంధనలను పాటించని సందర్భాలలో ప్రతి యజమానిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పడవల నిర్వహణ విషయంలో కూడా సంబంధిత యజమానులు నిబంధనల మేర పర్మిట్లను పొంది ఉండాలని వెంకట్రామయ్య చెప్పారు.

ప్రభుత్వ భూమిలో అక్రమంగా వరి నాట్లు
నాగాయలంక, సెప్టెంబర్ 19: మండల పరిధిలోని నంగేగడ్డ రెవెన్యూ గ్రామ పరిధిలో (వక్కపట్లవారిపాలెం గ్రామ పంచాయతీ సమీపంలో) గల ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించటమే గాక ఆ భూములలో వరి నాట్లు వేసేందుకు ప్రయత్నించిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను తహశీల్దార్ మద్దినేని వెంకట్రామయ్య తెలిపారు. నంగేగడ్డ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెం.28, 29, 30, 48లలోని 11 ఎకరాల గట్టు భూములను ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ఆ మేరకు సరిహద్దులను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ భూమిలో ఎవ్వరూ ప్రవేశించరాదని, ఆ విధంగా ప్రవేశించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత భూమి వద్ద అధికారికంగా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ తుంగలవారిపాలెంకు చెందిన 15 మంది వ్యక్తులు ఈ భూమిలో ప్రవేశించి అక్రమంగా నాట్లు వేసేందుకు ప్రయత్నించారని, ఈ విధంగా ఈ భూమిలో ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము పోలీసు శాఖను కోరినట్లు వెల్లడించారు. నంగేగడ్డ గ్రామ రెవెన్యూ అధికారి పెండ్యాల చంద్రమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమంగా ప్రభుత్వ భూమిలో ప్రవేశించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చల్లా కృష్ణ వివరించారు.