కృష్ణ

గ్రామీణులకు భరోసా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించే అవకాశం అందరికీ రాదని, అతి కొద్ది మంది మాత్రమే ఆ అదృష్టం దక్కుతుందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుందన్నారు. వృత్తి పట్ల అంకిత భావంతో కలిగి ఉండటంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజకు సేవ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా మహిళా కానిస్టేబుల్స్‌గా ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో విధులు నిర్వర్తించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సమర్ధవంతమైన సేవలు అందించాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, డీఎస్పీలు డీఎస్పీ ధర్మేంద్ర, మొహబూబ్ బాషా, సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ రంగనాథ్, ఆర్‌ఎస్‌ఐలు సతీష్, కృష్ణ, ఎఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు.