కృష్ణ

అంధత్వ నివారణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : అంధత్వ నివారణే లక్ష్యంగా వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు గిలకలదిండి మున్సిపల్ హైస్కూలులో వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌తో కలిసి మంత్రి పేర్ని నాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ బాల బాలికలు తమకు సరిగ్గా కనిపించని విషయాన్ని దాచి కంటి జబ్బులను పెద్దవిగా చేసుకుంటున్నారన్నారు. అలాంటి పిల్లల కోసమే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకు వచ్చిందన్నారు. జిల్లాలో 4వేల 700 పాఠశాలల్లో 6లక్షల 30వేల మంది బాల బాలికలకు ఈ నెల 15వతేదీ వరకు ప్రాథమిక చికిత్స చేస్తారన్నారు. ఇందు కోసం 100 మంది బాలలకు ఒక ఉపాధ్యాయుడిని నియమించి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ప్రాథమిక చికిత్సలో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి నవంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వతేదీ వరకు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు చేయిస్తామన్నారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ బాల్యం నుండి వచ్చే కంటి లోపాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వయస్సు పెరిగే సరికి బూతద్దాలతో కూడిన కళ్లజోళ్లు ఉపయోగించాల్సి వస్తుందన్నారు. తన బాల్యంలోనే వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎంగా ఉండి ఉంటే ఇటువంటి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా దృష్టి లోపాన్ని నివారించుకునే వాడినన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామచంద్రమూర్తి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ డా. జ్యోతిర్మణి, డెప్యూటీ డీఇఓ సత్యనారాయణమూర్తి, ఆర్డీవో ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవోగా ఖాజావలీ బాధ్యతల స్వీకరణ

మచిలీపట్నం, అక్టోబర్ 10: బందరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎన్‌ఎస్‌కె ఖాజావలీ గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్డీవోగా పని చేసిన జె ఉదయ భాస్కర్ కాపు కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గ్రూప్-1 అధికారి అయిన ఖాజావలీ నియమితులయ్యారు. గ్రూప్-1 ద్వారా ప్రభుత్వ శాఖలోకి వచ్చిన ఆయన జిల్లాలో 72 రోజుల పాటు (రెండున్నర నెలలు) ట్రైనీ డెప్యూటీ కలెక్టర్‌గా పని చేశారు. పెథాయ్ వంటి తుఫాన్, మసులా బీచ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల్లో విశేష సేవలు అందించారు. ఆర్డీవోగా బాధ్యతల స్వీకరణకు ముందు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌లను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. శిక్షణ పొందిన డివిజన్‌లోనే ఆర్డీవోగా తొలి పోస్టింగ్ లభించడం పట్ల ఖాజావలీ సంతోషం వ్యక్తం చేశారు. డివిజన్‌లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై పట్ల ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి నివేశన స్థలాలు మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ఖాజావలీని ఆర్డీవో కార్యాలయ ఎఓ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్, బందరు తహశీల్దార్ సునీల్ బాబుతో పాటు రెవెన్యూ వర్గాలు శుభాకాంక్షలు తెలిపాయి.