కృష్ణ

రైతు భరోసాను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం వివిధ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15వతేదీన రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టినట్టు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పామర్రులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమంతో పాటు నియోజకవర్గాల వారీగా రైతు భరోసా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.12,500లు ఆర్థిక సాయాన్ని అర్హులైన రైతులకు అందించడం జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ పూర్తి చేసి వారు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అర్హత మార్కులు తగ్గిస్తూ కటాఫ్ మార్కుల ఉత్తర్వులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ తదుపరి ఎంపికలు జరగాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత మాట్లాడుతూ స్పందనలో వచ్చే అర్జీలన్నింటినీ పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలపై బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఉందని, ఈ లోపు పెండింగ్ అర్జీలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 మోహనరావు, డీఆర్‌ఓ ప్రసాద్, ముడా వీసీ విల్సన్ బాబు, ట్రైనీ కలెక్టర్ అంజలీ అనుపమ, బందరు ఆర్డీవో ఖాజావలి, జడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు, సివిల్ సప్లయ్ డీఎం రాజ్యలక్ష్మి, డీసీఓ ఆనంద బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ మురళి, నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.