కృష్ణ

మొవ్వలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : మొవ్వ మండలంలో సోమవారం ఉదయం 11గంటలు నుండి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాలలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో పాదచారులు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. తహశీల్దార్ కార్యాలయం సమీపంలో వర్షం నీరు నిలవటంతో అర్జీదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కూచిపూడి, పెదపూడి ప్రధాన కూడలిలో, కాజ, కోసూరు ప్రధాన రహదారులలో వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం తక్షణమే రహదారులకరు మరమ్మతులు చేపట్టాలని సీపీఎం నాయకులు చేబ్రోలు భాస్కరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యాబోధన చేయాలి
గుడ్లవల్లేరు, అక్టోబర్ 14: విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని ఎంఇఓ శంకర్‌నాథ్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆనంద వేదిక శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మానసిక వికాసానికి ఆనంద వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రీసోర్స్ పర్సన్లు ఆనంద వేదిక కరదీపికలను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. వాటిలోని అంశాలను అనుసరించి విద్యార్థులకు బోధన చేయడం వల్ల విద్యార్థులలో ఉత్సాహం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.