కృష్ణ

ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : ప్రజలతో మమేకమై పోలీసు వ్యవస్థ పని చేస్తోందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మూడవ రోజైన గురువారం నగరంలో మినీ మారథాన్ నిర్వహించారు. స్థానిక మూడు స్థంభాల సెంటరు నుండి జిల్లా పోలీసు కార్యాలయం వరకు జరిగిన ఈ మారథాన్‌ను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మేమున్నామన్న భరోసాను కల్పిస్తున్నామన్నారు. మామరధాన్ పరుగులో పోలీసు సిబ్బందితో పాటు పోలీసు అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రజలు, యువత, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మారధాన్ పరుగులో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలను ఎస్పీ రవీంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, పలు విభాగాల డీఎస్పీలు మెహబూబ్ భాషా, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, వెంకట నారాయణ, కొండయ్య, వెంకటేశ్వరరావు, ఆర్‌ఐలు చంద్రశేఖర్, వెంకట్రావు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న డైరెక్టర్ హరిప్రసాద్
మోపిదేవి, అక్టోబర్ 17: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూనపరెడ్డి హరిప్రసాద్ గురువారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఫణిశర్మ నాగపుట్ట పూజలు నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసీ జివిడిఎన్ లీలాకుమార్ స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బి మురళీ, ఎంఇఓ కె రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే గురువారం స్వామివారి జన్మనక్షత్రం కృత్తికా నక్షత్రం కావటంతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

రైతు బజారు వినియోగదారుల కమిటీ ఏర్పాటు
కూచిపూడి, అక్టోబర్ 17: వినియోగదారులకు తాజా కూరలు, పండ్లు, పూలు, నిత్యావసర వస్తువులు రైతు బజారు ద్వారా ఒకేచోట కొనుగోలు చేసుకునేందుకు వినియోగదారుల కమిటీ కృషి చేయాలని మొవ్వ వ్యవసాయ మార్కెట్ ఎడీఎం కె రవి కుమార్ కోరారు. స్థానిక రైతు బజారును అభివృద్ధి చేసేందుకు గురువారం జిల్లాలో తొలి సారిగా రైతు బజారు వినియోగదారుల కమిటీని ఏర్పాటు చేసిన ఘనత తమదేనని రవి కుమార్ పేర్కొన్నారు. కెపిసి శర్మ గౌరవాధ్యక్షుడుగా, తాతా వెంకట రాంబాబు అధ్యక్షుడుగా, ఎ రవికుమార్, కోటేశ్వరరావు తదితర 45 మందితో వినియోగదారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూచిపూడి రైతు బజారులో తొలి సారిగా పూలు, పండ్ల స్టాల్‌ను రవి కుమార్ బృందం ప్రారంభించింది. ఎడీఎ మాట్లాడుతూ కూచిపూడి రైతు బజారులో త్వరలో కిలో రూ.37కు నాణ్యమైన బీపీటీ బియ్యంతో పాటు పాలు, నిత్యావసర వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూ.60లక్షల వ్యయంతో గతంలో కూచిపూడి రైతు బజారును నూతన ఒరవడితో నిర్మించారని, సరైన ఆలనాపాలనా లేక స్టాల్స్ రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మండల స్థాయిలో వినియోగదారుల కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా రైతులకు నెలకు రూ.5వేలు వంతున లాభం పొందే విధంగా తాను కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఓ పి కిరణ్ కుమార్, హార్టికల్చర్ ఎఓ ఎస్‌కె చాందిని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమర వీరుల త్యాగ ఫలితమే సమాజంలో శాంతి
తోట్లవల్లూరు, అక్టోబర్ 17: పోలీసు అమర వీరుల త్యాగాల ఫలితమే నేటి సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలని హెచ్‌ఎం వై ధనలక్ష్మి అన్నారు. పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఎల్బీఆర్సీఇ మెకానికల్ విద్యార్థుల ప్రతిభ

మైలవరం, అక్టోబర్ 17: రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీ కార్ డిజైన్ ఛాలెంజ్ పోటీలలో స్థానిక ఎల్బీఆర్సీఇ మెకానికల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ కె అప్పారావు గురువారం తెలిపారు. కళాశాలలో మెకానికల్ మూడవ, నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ పరిఙ్ఞనంతో కళాశాల మేనేజ్‌మెంట్ సహకారంతో ఆటోమోబైల్ ఆల్ టెర్రయిన్ వాహనాన్ని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సహకారంతో అభివృద్ధి చేసి బికనీర్ రాజస్థాన్ ర్యాలీ కార్ డిజైన్ ఛాలెంజ్-2019(ఆర్‌సిడిసి) అనే పోటీలలో ఈనెల 2,3.4 తెదీలలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈపోటీలలో అనేక దశలను దాటుకుంటూ వాహనాన్ని నడిపి సఫలీకృతులైనట్లు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, ఇన్‌ఫ్రాడైరెక్టర్ కె తిమ్మారెడ్డి, ప్రిన్సిపాల్ కె అప్పారావు, మెకానికల్ విభాగాధిపతి ఎన్ పిచ్చిరెడ్డి తదితరులు అభినందించారు. ఈ వాహనం తయారీలో మొత్తం 32 మంది మెకానికల్ విద్యార్థులు, ఇద్దరు ఏరోస్పేస్ విద్యార్థులు డాక్టర్ పి రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు.