కృష్ణ

నేతన్నకు ఆపన్న హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నేతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించనుంది. ‘వైఎస్‌ఆర్ చేనేత ఆపన్న హస్తం’ యేడాదికి రూ.24వేలు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 4వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాన్ని డిసెంబర్ 21వతేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేతన్నకు ఆర్థిక సాయం అందించే విషయమై బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమోద ముద్ర పడింది. అయితే మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. ఉప వృత్తుల మీద ఆధారపడి జీవించే కార్మికులను ప్రభుత్వం విస్మరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప వృత్తిదారులు లేకుంటే చేనేత వస్త్రం తయారు కాని పరిస్థితి. అలాంటప్పుడు ఉప వృత్తిదారులను పక్కన పెట్టి కేవలం మగ్గం కలిగిన నేత కార్మికుడికే ఆర్థిక సాయం అందించడం ఏమిటన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి. జిల్లాలో మొత్తం ఆరు చేనేత క్లస్టర్ల పరిధిలో 37 చేనేత సంఘాలు ఉన్నాయి. పెడన పట్టణం, గూడూరు మండలం పోలవరం, కప్పలదొడ్డి, మల్లవోలు, ఐదుగుళ్లపల్లి, రాయవరం, మొవ్వ మండలం కాజ, ఘంటసాల, చల్లపల్లి, గన్నవరం మండలం ముస్తాబాదా, ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామాల్లో చేనేత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీ వర్తింపునకు ఆరు నెలల క్రితమే చేనేత కుటుంబాల సర్వే చేపట్టింది. ఉప వృత్తిదారులతో కలిపి మొత్తం జిల్లాలో 5వేల 307 కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు అధికారులు నాటి సర్వేలో లెక్కలు తేల్చారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం మగ్గం ఉన్న వారికే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో 5వేల 307 చేనేత కుటుంబాల్లో మగ్గం కలిగిన కుటుంబాల సంఖ్య సుమారు 3వేల 500 నుండి 4వేలు ఉంటాయని సంబంధిత శాఖాధికారులు భావిస్తున్నారు. గ్రామ వలంటీర్లు, చేనేత జౌళిశాఖ ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తయారు చేసిన అర్హుల జాబితాను అక్టోబర్ 31వతేదీన ప్రకటించనున్నారు. 31వ తేదీన జరిగే గ్రామసభలో ఇంకెవ్వరైనా అర్హులు ఉంటే వారి పేర్లు కూడా పరిగణలోకి తీసుకుని ఆర్థిక సాయం అందించనున్నారు.