కృష్ణ

డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): సమస్యల పరిష్కారం కోరుతూ 104 వైద్య ఉద్యోగులు సోమవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గడిచిన పది నెలలుగా ఉద్యోగులకు ఇవ్వవలసిన ట్రావెల్, డైలీ ఫుడ్ అలవెన్స్‌లు ఇవ్వాలని, గత సర్వీస్ ప్రొవైడర్ పీఎస్‌ఎంఆర్‌ఐ నుండి రావల్సిన బకాయిలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 104 వైద్య వాహన సేవలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు సీఐటీయు పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం తదితరులు సంఘీభావం తెలిపారు.

తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఓఏల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 21: వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్)కు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వీఓఏలందరికీ గ్రూపు ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింప చేయాలని, రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని, హెచ్‌ఆర్‌ఏ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ సునీల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఓఎ యూనియన్ అధ్యక్షులు వై నాగలక్ష్మి, కార్యదర్శి కనకదుర్గ, కోశాధికారి రామలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, సీఐటీయు బందరు మండల కార్యదర్శి సిహెచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు.