కృష్ణ

గ్రామీణ చైతన్య వారోత్సవాలకు ప్రతిజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు : ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకోకుండా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఎస్‌కె లతీఫ్ భాషా సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఉద్యోగుల్లో మానసికంగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నందున లంచాలు తీసుకోకూడదు అనే పరివర్తన కలిగించడానికి ఈ ప్రతిజ్ఞ ఉపయోగపడుతుందన్నారు. ఆర్‌ఐ ఎల్ వెంకటేశ్వరరావు, వీఆర్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్‌జీఎస్‌లో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు
జగ్గయ్యపేట, అక్టోబర్ 29: చదువుకునే వయస్సులో విద్యార్థినీ, విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని, ర్యాగింగ్ పేర ఈవ్‌టీజింగ్‌తోను తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని నందిగామ డివిజన్ శక్తిటీమ్ మహిళా కానిస్టేబుల్స్ వివరించారు. పట్టణంలోని ఎస్‌జీఎస్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై జరిగిన కార్యక్రమంలో మహిళా కానిస్టేబళ్ళు టి శివకుమారి, వి పద్మావతి, ఎం నాగశ్రావణి, జి అనూషా ఠాగూర్‌లు మాట్లాడుతూ ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడితే తీసుకునే చర్యలను వివరించారు. ప్రిన్సిపాల్ ఈశ్వరయ్యశెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీడీవీ ప్రసాద్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

బాల్య వివాహాలను అడ్డుకోవాలి
ముసునూరు, అక్టోబర్ 29: బాల్య వివాహాలు అనేవి అనాగరిక చర్య అని, బాల్య వివాహాలను ప్రతి ఒక్కరు అడ్డుకుని ఎంపీడీఓ కె పార్థసారథి పేర్కొన్నారు. మండల కేంద్రమైన ముసునూరులోని గ్రామ సచివాలయం -2లో మంగళవారం బాల్య వివాహాలు వాటి నివారణ, మహిళల భద్రత అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంపీడీఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని, చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల వారు శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేని వయసులోనే పిల్లల్ని కనడం వల్ల త్వరగా రోగాల బారిన పడతారన్నారు. అలాగే వారికి పుట్టే పిల్లలు కూడా అనారోగ్యంతో బాధపడతారన్నారు. అలాగే గ్రామాల్లో మహిళలకు సరైన రక్షణ కల్పించిననాడే గాంధీజి కన్న కలలు నేరవేరతాయన్నారు. మహిళలపై జరిగే దాడులను నియంత్రించేందుకు ముందుగా ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మహిళలకు రూపొందించిన చట్టాలు వాటి అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించి సమాజాన్ని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జీ ఇఓపీఆర్‌డి జంగం యోహాను, అంగన్‌వాడి సూపర్‌వైజర్లు శ్రీలక్ష్మి, లక్ష్మి, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.