కృష్ణ

‘కృష్ణా వర్సిటీ’ గాడిన పడేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. గత పది నెలలుగా ఇన్‌ఛార్జ్‌ల పాలనలో మగ్గుతున్న కృష్ణా విశ్వ విద్యాలయానికి పూర్తి స్థాయి అధికారుల నియామకానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవలే ఇన్‌ఛార్జ్ రిజిష్ట్రార్ స్థానంలో రెగ్యులర్ రిజిష్ట్రార్‌ను నియమించారు. యోగి వేమన విశ్వ విద్యాలయం వైస్ ప్రిన్సిపాల్ అయిన ఆచార్య కె కృష్ణారెడ్డిని కృష్ణా వర్సిటీకి రెగ్యులర్ రిజిష్ట్రార్‌గా నియమించగా ఆయన గత వారం రోజుల క్రితం బాధ్యతలు సైతం తీసుకున్నారు. మరో కీలకమైన ఉపకులపతి పోస్టు భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పదవి కోసం 220 మంది సెర్చ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. కీలకమైన ఉపకులపతి పోస్టు భర్తీకి ప్రభుత్వం సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుండి అనుభవజ్ఞులైన వ్యక్తితో భర్తీ చేయాలని ఆలోజిస్తోంది. దీంతో రాజకీయ జోక్యం మరింత పెరిగింది. విశ్వ విద్యాలయం ఏర్పడిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన మైనేని దుర్గా ప్రసాద్, వి వెంకయ్యలు ఉపకులపతిగా సేవలు అందించారు. ఆ తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన సుంకరి రామకృష్ణారావు పూర్తి స్థాయి ఉపకులపతిగా సేవలు అందించగా డి సూర్యచంద్రరావు ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా పని చేశారు. ఇప్పటి వరకు ఈ రెండు సామాజిక వర్గాల వారికే ఉపకులపతి పదవి లభించింది. దీంతో ఈ విడత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు వర్గాలే కాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన గతంలో ఇన్‌ఛార్జ్‌గా సేవలు అందించిన సూర్యచంద్రరావు కూడా రెగ్యులర్ ఉపకులపతిగా వచ్చేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గాం నుండి గతంలో రెగ్యులర్ రిజిష్ట్రార్‌గా సేవలు అందించిన పులిపాటి కింగ్ పేరు వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం నుండి డీవీ చలం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యదవ సామాజిక వర్గానికి చెందిన చలం ప్రస్తుతం నాగార్జున విశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుండి ప్రసాదరావు పేరు వినిపిస్తోంది. ఈయన ఆంధ్రా విశ్వ విద్యాలయం రెక్టార్‌గా సేవలు అందిస్తున్నారు. వీరు నలుగురు జిల్లాకు చెందిన వారి వారి సామాజిక వర్గ నేతల ద్వారా పైరవీలు సాగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విడత ఉపకులపతి నియామకంలో సామాజిక సమీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.