కృష్ణ

వైభవంగా శ్రీ లక్ష్మణ యతీంద్రుల దివ్య ఆరాధనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో ముముక్షుజన పూర్వ పీఠాధిపతులు శ్రీ లక్ష్మణ యతీంద్రుల దివ్య ఆరాధనోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముముక్షుజన మహాపీఠాధిపతులు ముత్తీవి సీతారాం గురుదేవ దంపతులు లక్ష్మణ యతీంద్రుల విగ్రహానికి ఆవు పాలతో అభిషేకించారు. అనంతరం లక్ష్మణ యతీంద్రాష్టక పఠనం నేపథ్యంలో భక్తుల వాసుదేవ నామస్మరణల మధ్య లక్ష్మణ యతీంద్రులకు పూజాదికాలు నిర్వహించారు. శ్రీ అభయ వీరాంజనేయస్వామి వారికి భక్తులు సమర్పించిన తులసిదళ మాలలు, గజపూల మాలలు సమర్పించారు. అనంతరం యతీంద్ర సేవాసమితి సభ్యుల పర్యవేక్షణలో తుర్లపాటి రాధాకృష్ణ, ఆత్మకూరి లక్ష్మణదాసు తదితరులు భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.

ఘనంగా ప్రారంభమైన సుదర్శన హోమం
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 15: స్థానిక చెమ్మనగిరిపేట గాంధీ బొమ్మ శివాలయం ప్రాంగణంలోని విశాఖ శారదాపీఠ పరిపాలిత శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న మండల పూజా మహోత్సవాలు సందర్భంగా సుదర్శన హోమం ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. పుణ్యాహవచనం, దీక్షాదారణ, పంచగవ్య ప్రాసన, శ్రీ అయ్యప్ప వాస్తు, నవగ్రహ హోమాలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామికి నవ విధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇరగవరం పండితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అరుణ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యదర్శి డిఎస్‌వి రాంబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు.